Breaking News

ప్రభుత్వ ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉత్తర్వులు 159 తేది: 26.12.2022 మేరకు జిల్లాలోని అందరు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ ఆధారిత హాజరు నిర్వహణపై ఎన్.ఐ.సి., జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు జనవరి 01 నుండి సిబ్బంది ఈ నెల 16 నుండి ప్రారంభించాలని ఉత్తర్వులలో పెర్కొన్నవిధంగా ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎ.పి.ఎఫ్.ఆర్.ఎస్. యాప్ డౌన్ లోడ్ విధానంలో ఇబ్బందులు తలెత్తితే ఎన్.ఐ.సి. అధికారులను (7013364471) సంప్రదించాలని సూచించారు. డి.డి.ఓ. గా ఉన్న అధికారులు తమ సిబ్బంది పనిచేసే ప్రదేశాల జియోగ్రాఫికల్ (అక్షాంస, రేఖాంశాల) లొకేషన్ అసైన్ చేయాల్సి ఉంటుందని పూర్తి స్థాయిలో ఈ నెల 16 నుండి హాజరు నమోదు జరిగేలా చూడాలని సూచించారు. హాజరు నిర్వహణలో ఇబ్బందులను గుర్తించి త్వరగా నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి నివేదించాలని డి.ఆర్.ఓ. వారికి సూచించారు. ఈ సమీక్షలో జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాసరావు, డి.డి.ఓ. లుగా ఉన్న జిల్లా ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *