Breaking News

మున్సిపల్ కార్పోరేషన్ పార్క్ ప్రారంభం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా మార్చుకోవడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక కృషి చేస్తుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. గురువారం ఆర్.టి.సి.కాలనీ 5 వ లైన్ లో రూ.42 లక్షలతో అభివృద్ధి చేసిన మున్సిపల్ కార్పోరేషన్ పార్క్ ను మేయర్, ఎం.ఎల్.ఏ. మహ్మద్ ముస్తఫా, కమిషనర్ కీర్తి చేకూరిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగా ఆర్.టి.సి.కాలనీ 5వ లైన్ లో షుమారు అర ఎకరంలో స్థానికులకు ఎంతగానో ఉపయోగపడేలా, ఆహ్లాదం, ఆరోగ్యం అందించేలా పార్క్ ను అభివృద్ధి చేశామన్నారు. నగర సమగ్ర అభివృద్ధి అంతే రోడ్లు, కాలువల నిర్మాణమే కాదని, పచ్చదనం పెంపు కూడా అభివృద్ధిలో భాగమేనన్నారు. ఇప్పటికె ఆర్.టి.సి.కాలనీలో ఒక పార్క్ ఉన్నప్పటికీ మరో పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని ఇదే ప్రాంతంలో త్వరలో స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా నగరంలోని 57 వార్డ్ లను మోడల్ వార్డ్ లుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఎం.ఎల్.ఏ. మాట్లాడుతూ స్థానికంగా పార్క్ లు ఏర్పాటు చేస్తే సదరు ప్రాంతంలో ప్రజారోగ్య రక్షణకు చర్యలు తీసుకున్నట్లేనన్నారు. అతి తక్కువ కాలంలోనే ఆర్.టి.సి.కాలనిలో పార్క్ ను అభివృద్ధి చేశారన్నారు. నగరంలో పచ్చదనం పెంపు తద్వారా ప్రజలకు స్వచ్చమైన ఆక్సిజన్ ని అందించవచ్చని పేర్కొన్నారు. నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పార్క్ ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కాలనీల్లో స్థానికంగా ఉన్న పార్క్ ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామన్నారు. గాంధీ పార్క్ పనులు కూడా వేగంగా జరిగేలా ఈ.ఈ. స్థాయి అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ విధుల భాద్యతలు కేటాయించామన్నారు. ఆర్.టి.సి.కాలనీ పార్క్ లో రూ.42 లక్షలతో గార్డెనింగ్, మొక్కలు, ప్రహరి, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేశామన్నారు.
తొలుత శిలా పలకాన్ని ఆవిష్కరించి, పార్క్ ప్రధాన ద్వారాన్ని, ఓపెన్ జిమ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. అనంతరం మేయర్, ఎం.ఎల్.ఏ, కమిషనర్లు షటిల్ ఆడి షటిల్ కోర్ట్ ని ప్రారంభించారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, స్థానిక కార్పొరేటర్ కె.రంగారెడ్డి, ఏ.డి.హెచ్. రామారావు, ఈ.ఈ. కోటేశ్వరరావు, డి.ఈ.ఈ. కళ్యాణరావు, ఏ.ఈ. సేతుబాబు, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *