Breaking News

ఇంటింటి చెత్త సేకరణ తడి, పొడిగా వేరువేరుగా సేకరణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఇంటింటి చెత్త సేకరణ తడి,పొడిగా వేరువేరుగా సేకరణ చేయాలని, ఇప్పటికే నగరవాసులకు 3 రకాల డస్ట్ బిన్లు కూడా అందించామని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజారోగ్య విభాగ అధికారులతో, జూమ్ ద్వారా శానిటేషన్ కార్యదర్శులతో నగరంలో పారిశుధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణ, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో ప్రతి ఇంటికి తడి,పొడి, ప్రమాదకర వ్యర్ధాలను వేరువేరుగా ఇచ్చేందుకు వీలుగా 3 రకాల డస్ట్ బిన్లు ఇచ్చామని, అదేవిధంగా ఇచ్చేలా వారికి తెలియ చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఆర్.టి.సి.కాలని భాష్యం స్కూల్ దగ్గర ఎప్పటి నుండో ఉన్న గార్బేజ్ వల్న్రరబుల్ పాయింట్ ని సచివాలయం 4,5,6 కార్యదర్శులు సంయుక్తంగా చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్గించి లిట్టర్ ఫ్రీ పాయింట్ గా మార్చారని, వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. కార్యదర్శులు విధుల పట్ల నిబద్దతతో ఉంటే వచ్చే మార్పు ఇదన్నారు. కొందరు కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని అటువంటి వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సచివాలయం పరిధిలో కార్మికులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్.ఆర్.ఎస్. ద్వారానే హాజరు తీసుకోవాలని, ప్రతి కార్యదర్శి ప్రజలకు హోం కంపోస్ట్ తయారి ప్రాధాన్యత, తయారి విధానంపై అవగాహన కల్గించాలని, అలాగే అపార్ట్మెంట్ ల్లో క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద మొత్తంలో వ్యర్ధాలు వచ్చే హోటల్స్, రెస్టారెంట్లు కూడా తప్పనిసరిగా ఆన్ సైట్ క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే కమర్షియల్ సంస్థలు షాప్ ముందు డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని, లేని వాటిని సీజ్ చేయాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ చేసే సమయంలోనే ఆర్.ఎఫ్.ఐ.డి.ట్యాగ్ లను స్కాన్ చేయాలని, స్కానర్లు మరమత్తు ఉంటే వెంటనే చేయించాలన్నారు. కమర్షియల్ సంస్థల నుండి వ్యర్ధాలు సేకరణ చేసే రామసేతు సంస్థ సక్రమంగా వ్యర్ధాల సేకరణ చేయడం లేదని సచివాలయంల నుండి అందిన ఫిర్యాదు మేరకు సదరు సంస్థకు నోటీసు జారీ చేయాలని ఎం.హెచ్.ఓ.ని ఆదేశించారు. 2023 స్వచ్చ సర్వేక్షణ్ లో గుంటూరు నగరం మెరుగైన ర్యాంక్ సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్.ఐ.డివిజన్ల వారిగా రూట్ మ్యాప్ ప్రకారం చెత్త తరలింపుకు వాహనాలు వచ్చేలా వెహికిల్ షెడ్ అధికారులు చూడాలని, ఎక్కడైనా సమస్య ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంహెచ్ఓ, ఎస్.ఎస్.లు ప్రతి రోజు వార్డ్ ల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, పారిశుధ్య మెరుగుకు చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలకు సిఫార్స్ చేయాలని ఆదేశించారు. సచివాలయ పరిధిలో పక్కాగా పారిశుధ్య పనులు జరిగేలా, ఇంటింటి చెత్త సేకరణ, ప్రధాన రహదార్ల స్వీపింగ్లకు కార్మికుల కేటాయింపు జరగాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ లు లేని వ్యాపార వాణిజ్య సంస్థలను సీజ్ చేయాలన్నారు.
సమావేశంలో ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఈ.ఈ. కొండారెడ్డి, డి.ఈ.ఈ. హనీఫ్, యస్.యస్.లు ఆనందకుమార్, రాంబాబు, ఆయుబ్ ఖాన్, సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.

.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *