Breaking News

వేద పాఠశాల పై భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వెలంపల్లి

-బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి వున్నాం – వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 39డివిజన్లో కామకోటి నగర్ లో నూతనంగా నిర్మించిన వేద పాఠశాల పై అంతస్తును మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలోను ఈ పాఠశాల భవనాన్ని నేను 2019 లో ఎమ్మెల్యే గా వున్నా సమయంలో నా ఎమ్మెల్యే నిధులతో నిర్మించడం జరిగిందన్నారు.తిరిగి మల్లి దేవదాయ శాఖ మంత్రిగా ఉండగా సీజీఎఫ్ నిధుల నుండి 12 లక్షల రూపాయలు ఇచ్చి పై అంతస్తును నిర్మించడం జరిగిందన్నారు.వేద పాఠశాలలో విధ్యార్దులు మంచిగా చదువు కోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి వున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ,డివిజన్ నాయకులు కార్యకర్తలు,వేద పాఠశాల పురోహితులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *