విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ అధికార బాషా సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ అధికార బాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీ స్థానిక ఎస్ ఆర్ ఆర్ అండ్ సి వి ఆర్ డిగ్రీ కళాశాల నందు వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా వేమన పద్యాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు విజయబాబు తెలిపారు. అధికార బాషా సంఘం నిర్వహించే ఈ పోటీలలో నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొనుటకు అర్హులు. కనుక వేమన పద్య పఠన పోటీలలో పాల్గొనే విద్యార్థులు వారి గుర్తింపు కార్డులతో గురువారం ఉదయం 9 గంటలకు తమ తమ పేర్లను నమోదు చేసుకోవాలని విజయబాబు వివరించారు. పోటీలలో విజేతలైన విద్యార్థులకు అధికార బాషా సంఘం తరపున బహుమతులు అందజేయడం జరుగుతుందని అధ్యక్షులు విజయబాబు తెలిపారు.
Prajavartha Online Telugu News