-జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సియంఆర్) సరఫరాను వేగవంతం చేయాలని మిల్లు యజమానులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ జిల్లాలోని మిల్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిల్లు యజమానులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ, సియంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి త్వరితగతిన అందించే విధంగా చర్యలు చేపట్టి పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతున్నాయని ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల వద్ద నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించడం జరిగిందన్నారు. సమావేశంలో బ్యాంకు సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని మిల్లర్లు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ మిల్లర్ల సమస్యలను ఫోన్ద్వారా బ్యాంకర్లతో చర్చించారు. సమావేశంలో డిఎస్వో పి కోమలి పద్మ, డిస్టిక్ట్ మేనేజర్ శ్రీరామమూర్తి జిల్లాలో పలు రైస్ మిల్లు ప్రధినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News