Breaking News

మకుటంలేని మహరాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ ప్రపంచంలో విభిన్న పాత్రలకు ప్రాణం పోసిన మకుటంలేని మహరాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా పేద బలహీన వర్గాల ప్రజలకు వినూత్నమైన పథకాలను అమలు చేసి వారి హృదయాలలో చిరస్మరనీయులుగా నిలిచిపోయారని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ డిల్లీరావు ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సినీ రంగంలో పౌరాణిక పాత్రలకు జీవం పోసి జానపద పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించి నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు చలన చిత్రానికి ఎనలేని సేవలందించారన్నారు. విజయవాడ మున్సిపల్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించి ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాల, గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారన్నారు. మద్రాస్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష రాసి సబ్‌ రిజిస్టర్‌ ఉద్యోగంలో చేరారన్నారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామ చేసి 1949వ సంవత్సరంలో పల్లెటూరు చిత్రం ద్వారా సినీ రంగంలో అడుగు పెట్టారన్నారు. ఎన్‌టిఆర్‌ క్రమశిక్షణ, సమయ పాలనను కచ్చితంగా పాటించేవారన్నారు. 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రిగా పదవీభాధ్యతలు స్వీకరించిన స్వర్గీయ ఎన్‌టిఆర్‌ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి అవిరళ కృషి చేసి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన నాయకుడిగా ప్రజల హృదయాలలో చిరస్మరనీయంగా నిలిచిపోయారని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *