Breaking News

స్కిల్‌ హబ్స్‌లో ఈ మాసాంతానికి శిక్షణ ప్రారంభించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ హబ్స్‌లో ఈ మాసాంతానికి శిక్షణ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
స్థానిక పరిశ్రమల్లో స్థానికంగానే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ హబ్స్‌ ఏర్పాటు పై బుధవారం స్థానిక పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలశాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్‌తో కలెక్టర్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటర్‌ అంతకన్నా తక్కువ చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ కళాశాలలో ఒక స్కిల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో స్కిల్‌ హబ్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా మన్నారు. వీటిలో భాగంగా ఇప్పిటికే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రారంభమైనదని, మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో స్కిల్‌ హబ్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, ప్యాకల్టీ, ఆయా రంగాలలో ఇవ్వాల్సిన శిక్షణకు అవసరమైన నిరుద్యోగ యువత గుర్తింపు ప్రక్రియలను ఈ మాసంతానికి పూర్తి చేసి, శిక్షణ ప్రారంభించాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించే విధంగా కోర్సులను తీర్చిదిద్దాలన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో స్కిల్‌ హబ్స్‌లకు ఐటిఐ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే ఆయా సంస్థలే ఉపాధి కల్పించేలా సమన్వయం చేసుకోవాలన్నారు.
శిక్షణ ఇచ్చే హబ్స్‌లలో విశాలమైన క్లాసు రూమ్‌, ల్యాబ్‌లు, మరుగుదొడ్లు, ఆడియో విజువల్‌ ఎక్విప్మెంట్‌ స్త్రీ, పురుషులకు విడివిడిగా రెస్ట్‌ రూములు ఉండాలన్నారు. ఆయా కోర్సులలో శిక్షణ ఇచ్చే ట్రైనర్స్‌తో సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ముఖాముఖి నిర్వహించుకోవాలన్నారు. గతంలో నిర్వహించిన జాబ్‌ మేళాలలో ఎంపిక కాని వారిని, పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదివి మానివేసిన వారిని గుర్తించాలని అన్నారు. శిక్షణ అనంతరం తక్షణమే ఉద్యోగాలు లభించేలా ప్లేస్మెంట్‌ చూపాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు ఉన్న విలేజ్‌ సెక్రటరీల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలో అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులు.
మైలవరం నియోజకవర్గంలో డాక్టర్‌ ఎల్‌హెచ్‌ఆర్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులు.
నందిగామ నియోజకవర్గంలో గవర్నమెంట్‌ పాలిటెక్నికల్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ కళాశాలలో డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అసిస్టెంట్‌ బ్యూటీ తెరపిస్ట్‌ కోర్సులు.
తిరువూరు నియోజకవర్గం గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో రిటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సులు.
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ అసోసియేట్‌ కోర్సులు.
విజయవాడ వెస్ట్‌ నియోజవర్గంలో అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, అసిస్టెంట్‌ ప్లంబర్‌ కోర్సులకు శిక్షణను ఇచ్చే ట్రైనర్లను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఆయా కళాశాలలో స్కిల్‌ హబ్స్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని మైలిక వసతుల కల్పన ఈ మాసాంతానికి పూర్తి చేసి శిక్షణ ప్రారంభించాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
సమావేశంలో డిస్టిక్ట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పి. నరేష్‌కుమార్‌, డిస్టిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ డా. పి వి రమేష్‌కుమార్‌ , డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌, జియం ఇండస్ట్రీస్‌ వై. వీరశంకర్‌, ఆయా కళాశాల ప్రిన్సిపల్స్‌, ట్రైనర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *