గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నిజ జీవిత సత్యాలను, మానవతా విలువలను పద్యాల రూపంలో ప్రజలు అందించిన మహనీయుడు, ప్రజా కవి యోగి వేమన అని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా వేమన ప్రజా సాహిత్యాన్ని నేటి తరానికి అందించే కృషి చేస్తుందన్నారు. సామాజిక చైతన్యం, నీతి బోధనలు వేమన పద్యాల్లో ప్రముఖంగా ఉంటాయని, ప్రతి ఒక్కరి ఇంటిలో వేమన శతకం ఉండాలని, తద్వారా అయన నీతి బోదనలు పిల్లలకు తెలియచెప్పడానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్ సజిలా, అదనపు కమిశార్న్ పి.రోజ, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, మేనేజర్ శివన్నారాయణ, విభాగాధిపతులు, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News