రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయలు ద్వారా అందచేస్తున్న పౌర సేవలు సగటున ప్రతి రోజూ 91.19 సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లతో రెవెన్యూ, రీ సర్వే, జాతీయ రహదారులు, హౌస్ సైట్స్, స్పందన, జీ జి ఎం పి , పౌర సేవలు పై వెలగపూడి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఫిబ్రవరి 23 నాటికి 10 గ్రామాల్లో సర్వే చేపట్ట వలసి ఉండగా ఇప్పటికే 8 గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. జిల్లాలో పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన కోసం 941.3 ఎకరాల కు గాను క్షేత్ర స్థాయి లో 337 ఎకరాల్లో మ్యుటేషన్ చేపట్టినట్లు తెలిపారు.
ఈ క్రాప్ నమోదు 90024 ఎకరాలకు గాను 83, 184పూర్తి చేశామన్నారు. ఈ కేవైసి కి సంబంధించి 115750 మంది రైతులలో 85,641 మంది డేటా ఈ కె వైసి పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జగనన్న పాలవెల్లువ 49 యూనిట్స్ లో 35 యూనిట్స్ ద్వారా ప్రతి రోజూ సగటున 3,093 లీటర్ల పాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణాలు కి చెందిన ఉగాదికి గా నిర్దేశించిన లక్ష్యాలలో 68 శాతం మేర ప్రగతి పథంలో ఉన్నట్లు తెలిపారు. 25,030 స్వయం సహాయక సంఘాలకు గృహ రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కింద 984 పనులకు గాను 956 పనులకు పరిపాలన ఆమోదం ఇచ్చి నట్లు వాటిలో 885 పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పౌర సేవలు అందించే క్రమంలో గత వారంలో 45,385 పౌర సేవలు అందించగా, ఈవారం 46,690 సేవలకు 91.19 సగటు అందించ గలిగామన్నారు. రాష్ట్ర సగటు 61.34 ఉందని, మరింతగా పౌర సేవలు పెంచేందుకు కృషి చేస్తామని తెలియ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News