Breaking News

నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

-గణతంత్ర దినోత్సవ సందర్భంగా మూడు రోజులు క్రీడా పోటీలను నిర్వహిస్తాం
-ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలి
-కలెక్టర్ కే.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని , దేశ భక్తి ప్రతిబంభించేలా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలపై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, అదనపు ఎస్పీ రజనీ తో కలిసి తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నూతనంగా జిల్లా ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపు కుంటున్నామని అన్నారు. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలకు చెందిన కార్యాచరణ పై కలెక్టర్ దిశా నిర్దేశనం చేశారు. ప్రాథమికంగా తొమ్మిది శాఖలకు చెందిన వాహన శకటాల ప్రదర్శన ఏర్పాటు చెయ్యడం పై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జనవరి 26 న జిల్లా స్థాయి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం లో తప్పనిసరిగా అధికారులు, సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ముందస్తుగా ప్రదర్శన ఇచ్చే వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మునిసిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరు మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో బాధ్యత తీసుకోవాలన్నారు.గణతంత్ర దినోత్సవ సందర్భంగా మూడు రోజులు పాటు జనవరి 23, 24, 25 లలో క్రీడా పోటీలను నిర్వహిస్తాం అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనవరి 26 గురువారం నిర్వహించడం లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెవెన్యూ అధికారులు ప్రోటోకాల్, సిట్టింగ్ ఏర్పాట్లు, అల్పాహార, ప్రముఖులకు ఆహ్వానం, ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లో అంతరాయం లేకుండా జెనరేటర్ ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని మాపక శాఖ ఫైర్ సేఫ్టీ విధానం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అందరూ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *