Breaking News

2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), విజయవాడ వారు ఈ సంవత్సరము నిర్వహించుచున్న 2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్ అండర్ 19 యూత్ బాలురకు చాంపియన్ షిప్ పద్దతిలో మొదటగా జిల్లా స్థాయిలోను, తదుపరి రాష్ట్రస్థాయిలోను ఈ పోటీలు నిర్వహించుటకు తగు చర్యలు తీసుకొనియున్నారు.
కావున 2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్ ఈ నెల ది.22.01.2023 తేదిలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, కాకినాడ జిల్లా, కాకినాడ క్రీడా ప్రాంగణము నందు ఉమ్మడి తూర్పుగొదావరి జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించడం జరుగును.
ఈ ఎంపికలలో పాల్గొను జట్టు జిల్లా స్థాయిలో రూ.300/-లు ఎంట్రీ ఫీజు చెల్లించి ధరఖాస్తు పూర్తి చేసి క్రీడాకారులు తమ రిజిస్ట్రేషన్ చేసుకొనిన పిదప మాత్రమే ఈ పోటీలలో పాల్గొనవచ్చును. ధరఖాస్తుతో బాటు పుట్టిన తేదీ దృవీకరణ పత్రము / ఎస్.ఎస్.సి. మర్క్ మెమో, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు & ఆధార్ కార్డు నకలు జత చేసి ఇవ్వవలయును మరిన్ని వివరాలకు పి.బి.నాగే౦ద్రకుమార్ &  బి.దీపక్ ఆకాష్, హాకి కోచ్ వారి నెం. 9440919379 & 7386446889 లలొ సంప్రదించ గలరు. ఆశక్తి గల క్రీడాకారులు ఉదయం 07.00 గంటలకు హాజరు కావలయును.
ఈ ఎంపికలలొ ఎంపికకాబడిన జట్టు రాష్ట్ర స్థాయి 2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, కాకినాడ జిల్లా, కాకినాడ ఆస్ట్రొటర్ఫ్ హాకి క్రీడా ప్రాంగణములో జరుగును.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *