Breaking News

యోగి వేమన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్

-యోగి వేమన జీవితం వారి కవితలు భావితరానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
యోగి వేమన జయంతి పురస్కరించుకొని నేడు యోగివేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పుష్పాంజలి ఘటించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో యోగివేమన జయంతిని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో యోగివేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగు వారు ఉండరని యోగివేమన మహాకవి అని పామరులకు కూడా అర్థమయ్యేలా పద్యాలు ఆశువుగా చెప్పిన కవి వేమన అని గుర్తు చేశారు. సమాజ రుగ్మతలను రూపు మాపే చైతన్య పరిచే వేలాది పద్యాలు మనకి అందించారు అని తెలిపారు. వేమనకు లభించిన గౌరవం ఐక్యరాజ్యసమితి యునెస్కో విభాగం ప్రపంచ భాష కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని ఆ రచనలు పలు భాషల్లోకి అనువదింపజేశారని వేమన పద్యాలు లోకనీతులు, సామాజిక చైతన్యం కలిగించేవిగా కుల వ్యవస్థ, మతం తదితర సామాజిక అంశాలపై సరళ భాషలో హృదయానికి అందుకునేలా హత్తుకునేలా తన పద్యాలతో చైతన్యం కలిగించారు అని గుర్తు చేశారు. ఆయన జీవితాన్ని మరియు కవితల్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ప్రజలు అందరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, విద్యాశాఖ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *