Breaking News

2023-2024 NUTA ఎన్నికలలో ఆచార్య భట్టు నాగరాజు ఘన విజయం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో జరిగిన NUTA ఎన్నికలలో ఆచార్య భట్టు నాగరాజు ఘన విజయం సాధించారు. నూతనముగా కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా ఆచార్య భట్టు నాగరాజు,వైస్ ప్రెసిడెంట్ గా ఆచార్య వీ రవికుమార్ సెక్రటరీ గా ఆచార్య బీ హరిబాబు జాయింట్ సెక్రటరీ గా ఆచార్య ఎమ్ సుబ్బారావు ,ట్రెజరర్ గా ఆచార్య సీ హెచ్ లింగరాజు గెలుపొందారు. ప్రస్తుతం ఆచార్య భట్టు నాగరాజు విశ్వవిద్యాలయం లోని దూర విద్యా విభాగ బాధ్యులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.గతంలో 2019 సం లో ఉత్తమ ఆచార్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసింది.ఆయన 1995 నుండి డిపార్ట్ మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆచార్యులు గా వున్నారు. 2017 లో ఉత్తమ పరిశోధకుడిగా గ విశ్వవిద్యాలయం ఎంపిక చేయడం జరిగింది. ఆచార్య భట్టు నాగరాజు మాట్లాడుతూ అపరిష్కృతం గా వున్న విశ్వవిద్యాలయ అధ్యాపకుల సమస్యలు పరష్కారమయ్యే దిశగా అందరి సహకారం తో కలిసి పని చేసే అవకాశంగా ఈ గెలుపును భావిస్తూ ఓటు వేసి గెలపించిన వారికి హృదయ పూర్వక ధన్యాదములు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *