Breaking News

కష్టించే తత్వం తో ఆలోచనా నైపుణ్యం తో నే విజయం

-విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటుగా సామాజిక అంశాలపై కూడా పట్టు సాధించడం అవసరం
-జీవితంలో ఎంత ఎదిగినా మన మూలలను మరువకూడదు.
-ఆచార్య జీ విశ్వనాథన్, వెల్లూర్ VIT ఉపకులపతి, తమిళనాడు మాజీ మంత్రి
-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నేటి పత్రిక ప్రజావార్త :
కష్టించే తత్వం తో ఆలోచనా నైపుణ్యం తో నే విజయం సిద్ధిస్తుందని విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటుగా సామాజిక అంశాలపై కూడా పట్టు సాధించడం అవసరం అని
జీవితంలో ఎంత ఎదిగినా మన మూలలను మరువకూడదని వెల్లూర్ VIT ఉపకులపతి, తమిళనాడు మాజీ మంత్రి వర్యులు ఆచార్య జీ.విశ్వనాథన్ పేర్కొన్నారు. గురువారం విశ్వవిద్యాలయం లో జరిగిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై అవగాహనా కార్యక్రమం లో ముఖ్య అతిధిగా వెల్లూర్ VIT ఉపకులపతి, తమిళనాడు మాజీ మంత్రి వర్యులుఆచార్య జీ విశ్వనాథన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి మాట్లాడుతూ
విద్యార్థులను విజయ పథంలో నడిపించేందుకు విద్యా సామాజిక అంశాలలో చైతన్య వంతం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలకైనా విశ్వవిద్యాలయం సంసిద్ధం గా ఉందని విద్యార్థులు ఏకాగ్రతతో క్రమశిక్షణతో ఆచార్యులు బోధించే విద్య సంబంధిత విషయాలను నేర్చుకుని భవితకు ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ VIT ఉపకులపతి ఆచార్య ఎస్ వీ కోట రెడ్డి పాల్గొన్నారు. తదనంతరం ఇరు విశ్వవిద్యాలయాల విద్యా భివృద్ధికి M.O.U ఒప్పందం చేసుకొనడం జరిగినది. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య పీ.వరప్రసాద మూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బీ.కరుణ, ఆచార్య సునీత విశ్వ విద్యాలయ ఆచార్యులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *