విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వారి సంపూర్ణ మద్దతుతో రాబోయే ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.శుక్రవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ 59వ సచివాలయ పరిధిలోని దర్శిపేట మర్రిచెట్టు సెంటర్ నుండి మొదలై ఠాగూర్ టైప్ ఇనిస్టిట్యూట్ రోడ్, రామాలయం రోడ్ ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ విప్లవం మొదలుపెట్టారని అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 95 శాతం పైగా హామీలు అమలు చేయడంతో పాటు,ఎన్నికల మెనిఫెస్టో లో లేని ఎన్నో పధకాలు ఆచరణలో పెట్టారని కొనియాడారు. గడపగడపకు వస్తున్న వైస్సార్సీపీ నాయకులకు బ్రమహారథం పడుతున్న ప్రజల స్పందన చూస్తుంటేనే ప్రభుత్వం పట్ల వారు ఎంత సంతృప్తి గా ఉన్నారో అర్థం అవుతోంది అని అన్నారు. ప్రజలలో రోజురోజుకు జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అన్ని ఏకమై వారి మనుగడ కోసం ప్రాకులాడుతున్నాయని, కానీ అవన్నీ వృధా ప్రయాస తప్ప ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రజా ధనం దుర్వినియోగం చేసి, టీడీపీ నాయకులు సొంత ఆస్తులు పెంచుకోవడానికే పాటుపడ్డారని, లంచాలు,దందాలతో మహిళలను హించించారని విమర్శించారు. అందుకే గత ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి వైస్సార్సీపీ కి ఘన విజయం అందించారని అన్నారు. ఓడిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సహకారం అందిస్తూ వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రజా సమస్యలను తీర్చడానికి అండగా నిలుస్తున్నారు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్,వైస్సార్సీపీ నాయకులు చిమాటా బుజ్జి,ఉకోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శం
జన్మభూమి కమిటీల మాదిరిగానే వాలంటీర్ల వ్యవస్థ కూడా ఉంటుందని వారంతా భావించినట్టు ఉన్నారు. దానికి భిన్నంగా సేవే పరమావధిగా పనిచేస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల అకృత్యాలను ఏ రోజూ ఈ పచ్చ మీడియా ప్రశ్నించలేదు. వారి పత్రికల్లో రాయలేదు. వాలంటీర్ వ్యవస్థకు, జన్మభూమి కమిటీలకు చాలా వ్యత్యాసం ఉందని పచ్చ మీడియా వారు తెలుసుకోవాలి టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ప్రజల్ని దోపిడీ చేసి జలగల్లా పీక్కుతిన్నాయి. కానీ వాలంటీర్లు సేవా దృక్పధంతో పనిచేస్తున్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని ఇంటి ముందుకే అందిస్తున్న సర్వీసులను పచ్చ మీడియా కించపరుస్తోంది. వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మార్చాలనుకోవడం దురదృష్టకరం, దుర్మార్గం.కేవలం నామమాత్రపు పారితోషకంతో గొప్పగా సర్వీసు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మడం దురదృష్టకరం. ఒక పెత్తందారి వ్యవస్థ అధికారాన్ని చేతిలో ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తోంది.జగన్ గారిపట్ల అభిమానంతోనే వాలంటీర్లు సేవా ధృక్పథంతో పనిచేస్తున్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు…సేవకులు. వారు ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల అభిమానం చూపితే తట్టుకోలేని వ్యక్తులే ఇలాంటి రాతలు రాస్తున్నారు. మల్లమ్మ అనే ఆమెకు వారి ఇంట్లో కమర్షియల్ కరెంట్ మీటర్ ఉండటం వల్ల పెన్షన్ ఆగితే వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది, కానీ ఎల్లో మీడియా దాని మీద రాద్దాంతం చేస్తూ పిచ్చి రాతలు రాస్తూ వారి అక్కసు వెళ్లగక్కడం దారుణం. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేద ప్రజల కోసం బసవతారకం హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉన్న తెలుగుదేశం నాయకులు దానిని కూడా వారి కుటీల రాజకీయాలు లకి వాడుకోవడం సిగ్గిచేటు అని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వల్ల వాలంటీర్లకు ఒక గౌరవం దక్కింది. ప్రజలకు మంచి జరిగితే మీరు సహించలేరు. ప్రజలు ఆకలితో ఉంటేనే తన అవసరాలు తీరతాయని, తనకు అధికారం వస్తుందన్నది చంద్రబాబు నైజం అని అవినాష్ ఎద్దేవా చేసారు.
Prajavartha Online Telugu News