Breaking News

డివైజ్ డిస్ప్లే ఛార్జీలు వెంటనే వసూళ్లకు కార్యాచరణ సిద్దం చేయాలి..

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు లో అడ్వర్టైజింగ్ బోర్డ్లు, హోర్డింగ్ ఏజన్సీల నుండి మీడియా డివైజ్ డిస్ప్లే ఛార్జీలు వెంటనే వసూళ్లకు కార్యాచరణ సిద్దం చేయాలని, బోర్డ్ లకు క్యూఆర్ కోడ్, జియో ట్యాగ్ వచ్చే వారం నాటికి చేయాలని నగర కమిషనర్కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గారు మీడియా డివైజ్ ఫీజుల వసూళ్లలో పురోగతి లేదని, ప్రత్యేక బృందాల ద్వారా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, ఫీజులు చెల్లించని వారి బోర్డ్ లను తొలగించాలని స్పష్టం చేశారు. అలాగే బోర్డ్ లకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని, ప్రతి బోర్డ్ కు జియోట్యాగ్ లను రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సచివాలయం పరిధిలో ఎక్కడా అనధికార కట్టడాలు ఉండడానికి వీలు లేదని, అనధికార లేదా అక్రమ కట్టడాలను అడ్డుకోకుంటే సంబందిత ప్లానింగ్ కార్యదర్శే భాధ్యత వహించాల్సివస్తుందని తెలిపారు. నగరంలో ఉన్న అనధికార లే అవుట్స్ ని ఇన్ ప్రిన్సిపుల్ లే అవుట్స్ గా అప్లై చేయించాలన్నారు. నూతన భవన నిర్మాణ అనుమతులు ఇన్ ప్రిన్సిపల్ లే అవుట్ లో ఉంటేనే తేలికగా ఇవ్వడానికి వీలు కల్గుతుందన్నారు. విభాగ కోర్ట్ కేసులపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని, కౌంటర్స్, ప్యార వైజ్ రిమార్క్స్ పక్కాగా నిర్దేశిత గడువులోగా కోర్ట్ కు పంపాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో పోస్టర్స్ అంటించినా, బ్యానర్స్ కట్టినా పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు, భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని పట్టణ ప్రణాలిక అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణలో పెండింగ్ పనులు వేగవంతం చేయాలని, నూతనంగా విస్తరణ పనులు చేపట్టే ప్రాంతాల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. రోడ్ విస్తరణ ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణంపై ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు కాలేష, బాబురావు, అశోక్ కుమార్, అజయ్ కుమార్, సూపరిండేంట్ ప్రసాద్, టి.పి.ఎస్.లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *