రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ను లారీ ఓనర్స్ అసోసియేషన్ హల్, మోరంపూడి D Mart వెనుక, రాజమహేంద్రవరం నిర్వహించడం జరిగింది. డి టి సి కె యస్ ఎమ్ వి కృష్ణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమహేంద్రవరం: జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి, ప్రమాదాల నివారణకు అనేక సూచనలు తెలిపారు. వాహనాన్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, హెల్మెట్, సీట్ బెల్టు పెట్టుకోవాలని, అలాగే మద్యం సేవించి వాహనాన్ని నడపరాదని పలు సూచనలు తెలియచేశారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ప్రాథమిక వైద్యం ఎలా అందించాలనే వాటి పై శిక్షణ ఇచ్చారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చైతన్య, సుమ , అశోక్ లేలాండ్ మేనేజర్ డా. మాధురి శ్రీనివాస్, లారీ , వ్యాన్ అసోసియేషన్ సభ్యులు యజమానులు, డ్రైవర్లు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News