రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి వారి ద్వారా బాధితురాలికి “నల్సా వారి లైంగిక దాడి లేదా ఇతర నేరాలకు గురైన మహిళా బాధితులకి పరిహార పథకం, 2018” ద్వారా అక్షరాల నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని అందజేశారు. సీఆర్పీసీ సెక్షన్ 357-A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నేరం వలన నష్టపోయిన/గాయపడిన వారికి లేదా మరణించిన వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకి నష్ట పరిహారం అందించేలా పథకాలను ప్రవేశపెట్టారు. సదరు కోర్టు ఇచ్చిన తీర్పు మరియు న్యాయ సేవాధికార సంస్థలకు చేసిన సిఫార్సులను పరిగణించి న్యాయ సేవాధికార సంస్థలు ఆయా కేసులను పరిశీలించి అర్హత కలిగిన బాధితులకు “ఏ.పీ. విక్టిమ్ కంపెపెన్సేషన్ స్కీమ్, 2015 – నేరాలలో మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు/గాయాల పాలైన బాధితులు పరిహారం పొందవచ్చు” , “నల్సా వారి బాధితుల పథకం, 2018” ద్వారా లైంగిక దాడి లేదా ఇతర నేరాలకు గురైన మహిళా బాధితులకి పరిహారం అందించబడుతుంది. కోర్టు బయట రాజీ పడి కేసును సప్పోర్టు చేయని బాధితులకు ఈ పథకాలు వర్తిoచవు.
Tags rajamendri
Check Also
గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …
Prajavartha Online Telugu News