Breaking News

పార్టీని నమ్ముకున్న వారికి వైసీపీలో ఎప్పుడూ గుర్తింపు వుంటుంది… : జి.రవికుమార్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పార్టీని నమ్ముకున్న వారికి వైసీపీలో ఎప్పుడూ గుర్తింపు వుంటుందనడానికి నిదర్శనం గరికముక్కు రవికుమార్‌. విజయవాడ రూరల్‌ గొల్లపూడికి చెందిన గరికముక్కు రవికుమార్‌ మొదటి నుండి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి అభిమానిగా ఉంటూ, అనాడు పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తూ, అధినాయకత్వ అభినందనలు పొందారు. అనంతరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించడంతో ఆ సమయంలో రవికుమార్‌ సామాన్య కార్యకర్తగా, రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి పార్టీ, పెరుగుదలకు కృషి చేస్తుండటం అభినందనీయమని వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి యువనేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా, నవరత్నాలను ప్రవేశపెట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కులమతాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అమలుపరుస్తూ, బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా సామాజిక న్యాయం చేస్తూ నీతివంతమైన పాలన చేస్తూ ఉండటం పై గరిక ముక్కు రవికుమార్‌ మరింత ఉత్సాహంతో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తుచా తప్పకుండా అమలువరుస్తూ, నిబద్ధత కలిగిన పార్టీ యువనేతగా రవికుమార్‌ పార్టీ క్యాడర్‌లో మంచి గుర్తింపు పొందారు. ఈ తరంలో మైలవరం నియోజవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్‌ అలాగే, మంత్రి జోగి రమేష్‌ ఇరువురు కలిసి వైఎన్‌ఆర్‌ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శిగా గరికముక్కు రవికుమార్‌ని నియమించడం అభినందనీయమంటూ పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వసంత గెలుపు కోసం పార్టీలో రవికుమార్‌ ఇంటింటికీ వెళ్ళి, వగలు రాత్రి అనే తేడాలేకుండా, నాయకుడు గెలుపు కోసం గరిక ముక్కు రవికుమార్‌ చేసిన కృషి ఎనలేనిదని చెప్పవచ్చు. అలాగే గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా కోసం చేపట్టిన అనేక ధర్నాలు రాస్తారోకో కార్యక్రమాల్లో రవికుమార్‌ పాల్గొని, నాయకత్వం బాధ్యతలను నిర్వహించడం, అలగే డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌కి నివాళులర్పించడంలో బడుగు, బలహీన వర్గాలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం రవికుమార్‌ కే సాధ్యపడిరదని పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గరిక ముక్కు రవికుమార్‌ పార్టీ పెరుగుదల కోసం మరింత కృషి చేయాలని అలాగే పార్టీలో మరికొన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశిద్దాం!

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *