Breaking News

ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలకు జాతీయ స్థాయిలో ఆరు ప్రధాన అవార్డులు


-దేశంలోనే నెంబర్ వన్ విద్యుత్ ప్రసార సంస్థగా ఏపీ ట్రాన్స్కో అడుగులు
-మెరుగైన నెట్వర్క్ మెయింటెనెన్స్ మరియు మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను సులభతరం చేసే దిశగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(GIS) ను ఏ పీ ట్రాన్స్కో అమలు
-విద్యుత్ ప్రసార నష్టాలను 2.8 శాతంలోపు తగ్గించేందుకు ఏ పీ ట్రాన్స్కో చర్యలు
-ఎనర్జీ ఫోర్కాస్టింగ్ ద్వారా భవిష్యత్తు విద్యుత్ అవసరాల అంచనా, వినియోగదారులకు శాశ్వత ప్రాదిపదికన నాణ్యతతో కూడిన 24x 7 విద్యుత్ సరఫరా
-తమిళనాడు, రాజస్థాన్ మొదలైన అనేక రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్ పై ఆసక్తి కనబరిచాయి
-రెండు నెలల స్వల్ప వ్యవధిలో, ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు జాతీయ స్థాయిలో ఆరు ప్రధాన అవార్డులను సాధించాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ పీ ట్రాన్స్కో స్కోచ్ అవార్డులు (గోల్డ్, సిల్వర్) గెలుచుకున్న దృష్ట్యా విద్యుత్ రంగంలో ముఖ్యంగా ఏ పీ ట్రాన్స్కో లో పైన పేర్కొన్న విశిష్ట చర్యలను సమీక్షిస్తూ, ఏ పే ట్రాన్స్కో కృషిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రశంసించారు. తమిళనాడు, రాజస్థాన్ మొదలైన అనేక రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్ పై ఆసక్తిని కనబరిచాయని అన్నారు. ఈ నమూనా అలాగే ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు అమలు చేస్తున్న ఉత్తమ చర్యలను, ముఖ్యంగా ఏ పీ ట్రాన్స్కో , ఏ పీ జెన్కో , నెడ్క్యాప్ చేపట్టిన వివిధ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ మిషన్ చేపట్టిన ఇంధన సామర్థ్య కార్యక్రమాలు మొదలైనవాటిని పంచుకోవాలని ఆయా రాష్ట్రాలు కోరాయన్నారు. రెండు నెలల స్వల్ప వ్యవధిలో, ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు జాతీయ స్థాయిలో ఆరు ప్రధాన అవార్డులను సాధించిన విషయాన్నీ, ముఖ్యంగా భారతదేశ రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము నుండి అందుకున్న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరియు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల లక్ష్యానికి అనుగుణంగా ఈ ఉత్తమ విధానాలన్నీ రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలకు సహాయపడతాయని విజయానంద్ చెప్పారు.

ఈ వర్చువల్ సమీక్ష సందర్భంగా ఏపీట్రాన్స్కో చేపట్టిన వివిధ వినూత్న కార్యక్రమాలను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కి ఏ పీ టాన్స్కో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బీ శ్రీధర్ వివరించారు. ఏ పీ ట్రాన్స్కో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులలో భాగంగా, ప్రస్తుతం మూడు 400 kV సబ్స్టేషన్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఏపీఈపీడీసిఎల్ పరిధిలో ఉన్న 5 జిల్లాలకు మరింత నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రయోజనకారిగా ఉంటుందని ఆయన తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా అలాగే విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచే అనేక ఇతర ప్రాజెక్టులకు సంబంధించి సుమారు రూ. 500 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జిఇసి) పథకం కింద చాలా వరకు పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులన్నీ చివరి దశలో ఉన్నాయని సిఎండి ఏ పీ ట్రాన్స్కో శ్రీధర్ తెలిపారు.

స్కోచ్ అవార్డును సాధించడంలో ఏ పీ ట్రాన్స్కోకు పూర్తి సహాయసహకారాలు అందించిన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ఏపీట్రాన్స్కో దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ ప్రసార సంస్థ గా అవతరించేందుకు అన్ని విధాలా కృషి చేసి, బలమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎనర్జీ ఫోరేకేస్టింగ్ మోడల్ ను , జిఐఎస్ సిస్టమ్ను ట్రాన్స్కో లో ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన ఏ పీ ట్రాన్స్కో డైరెక్టర్ గ్రిడ్ ఎకెవి భాస్కర్ ను, దీనికి సహకరించిన సంబంధిత ఇంజనీర్లను ఆయన అభినందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు, మరీ ముఖ్యంగా ఏ పీ ట్రాన్స్కో ఇంజినీర్లు , సిబ్బంది యావత్తు పనితీరులో అత్యుత్తమ ప్రమాణాలు పాటించడం లో అగ్రభాగాన నిలిచేరని బీ శ్రీధర్ కొనియాడారు. ఇటీవల ఆరు ప్రధాన అవార్డులను సాధించడంలో వారి కృషి ప్రశంసనీయం అని ఆయన అన్నారు

భవిష్యత్ లో పెరగనున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (APTRANSCO) అత్యధిక విద్యుత్ లభ్యతను సాదించేందుకు అనేక ఉత్తమ పద్ధతులను అమలు చేస్తోంది. ఉత్తమ విద్యుత్ ప్రసార సంస్థ గా కొనసాగడమే కాకుండా భవిష్యత్తులో దేశంలోనే నెం.1గా అవతరించేందుకు అనేక వినూత్నమైన చర్యలను చేపట్టింది.

ఏ పీ ట్రాన్స్కో మెరుగైన నెట్వర్క్ మెయింటెనెన్స్ మరియు మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను సులభతరం చేసే దిశగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(GIS) ను అమలు చేసింది. దీని ద్వారా 63,000 టవర్లు, 30,010 సర్క్యూట్ కిలో మీటర్ల (ckm) లైన్ పొడవు మరియు 358 EHT సబ్స్టేషన్ల పరికరాల వివరాలతో కూడిన ఎక్సట్రా హై టెన్షన్ (EHT) నెట్వర్క్ ను సులభంగా నిర్వహించడానికి జీ ఐ ఎస్ సహాయపడుతుంది.

దీనికోసం ఏ పీ ట్రాన్స్కో ఒక ప్రత్యేకమైన జీ ఐ ఎస్ (GIS ) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఫీల్డ్ ఆఫీసర్ల క్రియాశీలత తో మొత్తం నెట్వర్క్ డేటా భౌగోళికంగా ఒకే ప్లాట్ఫారమ్పై మ్యాప్ చేయబడింది. భౌగోళిక మ్యాప్ల ద్వారా డేటాను యాక్సెస్ చేసి సమర్థవంతమైన నిర్వహణ కార్యకలాపాలను రూపకల్పన చేయడంలో అలాగే ప్రాథమిక సర్వే నిర్వహించడంలోనూ ఫీల్డ్ ఇంజనీర్లకు సులభతరం అయింది. ఇది సిస్టమ్ అధ్యయనాలను సమర్థవంతంగా నిర్వహించడానికి పవర్ సిస్టమ్ ఇంజనీర్లకు కూడా సహాయపడింది.

GIS కాకుండా, విద్యుత్ ప్రసార నష్టాలను 2.8 శాతంలోపు తగ్గించేందుకు ఏ పీ ట్రాన్స్కో చర్యలు తీసుకుంటోంది. చౌక ధరల వద్ద విద్యుత్ కొనుగోళ్లను సులభతరం చేసే అంతర్గత డిమాండ్ అంచనా నమూనా(ఇన్ హౌస్ ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్ )ను కూడా అభివృద్ధి చేసింది. ఎనర్జీ ఫోర్కాస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం భవిష్యత్తు విద్యుత్ అవసరాలను అంచనా వేయటం తద్వారా వినియోగదారులకు శాశ్వత ప్రాదిపదికన నాణ్యతతో కూడిన 24×7 విద్యుత్ సరఫరాను అందించడం.

APSLDC (స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి మరింత అధునాతన అంతర్గత ఎనర్జీ ఫోర్ కాస్టింగ్ మోడల్ ను అభివృద్ధి చేసింది, ఇది 97 నుండి 99 శాతం వరకు ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. ఈ అధునాతన సాంకేతికతలను ఉపయోగించి విద్యుత్తును ముందుంగానే అంచనా వేయడం తో ఖచ్చితమైన విద్యుత్ అవసరాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ ఫోర్కాస్టింగ్ టెక్నిక్తో, విద్యుత్ సంస్థలు విద్యుత్ కొనుగోళ్లలో కొన్ని కోట్ల రూపాయలు పొదుపు చేసింది. APSLDC ద్వారా అభివృద్ధి చేయబడిన డిమాండ్ ఫోర్ కాస్టింగ్ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థల్లో మొదటిది.

ఈ సమీక్ష లో జెఎండి హెచ్ఆర్డి, అడ్మిన్, ఐ పృధ్వి తేజ్, జెఎండి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, బి మల్లా రెడ్డి, డైరెక్టర్ ఫైనాన్స్, టి వీరభద్ర రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *