తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏఐటీయుసి, ఇస్కఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి జరిగే పోరాటానికి విఐ లెనిన్ చూపిన బాట నేటికీ దిక్సూచిల కొనసాగుతుందని ఇస్కాఫ్ తెనాలి డివిజన్ అధ్యక్షులు ఏఐటీయుసి తెనాలి అధ్యక్షులు యస్. గురుబ్రహ్మం నివాళులర్పించారు. తెనాలి గాంధీనగర్లో ఇస్కాప్ కార్యాలయంలో ఆదివారం లెనిన్ 99వ వర్ధంతి సభ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి గుంటూరు జిల్లా అధ్యక్షులు బొల్లిమంత కృష్ణ అధ్యక్షత వహించారు. గురుబ్రహ్మం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సోషలిజం ఎలా ఉంటుందో మానవాళికి ఆచరణలో చూపించిన మహోన్నతుడు లెనిన్ అన్నారు. మార్క్స్ సైందాత్త్వక సూత్రాలతో దోపిడి సామ్రాజ్యవాద శక్తుల నుండి పీడిత తాడిత వర్గాల విముక్తి కోసం సాయుధ పోరాటం నడిపి విజయం సాధించిన ఘనత లెనిన్ కే దక్కుతుందన్నారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా విప్లవ పోరాటాలు చేసి ప్రధమ సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించిన విప్లవకారుడు లెనిన్ అన్నారు. నేటికీ ప్రపంచంలో కొన్ని దేశాలు కమ్యూనిస్టు దేశాలుగా కొనసాగుతున్నాయన్నారు. అధ్యక్షత వహించిన బొల్లి ముంత కృష్ణ లెనిన్ జీవిత విశేషాలను వివరించారు. ఇస్కాప్ జిల్లా కార్యదర్శి మునిపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ కార్యా కార్యకలాపాలు నీటి నుంచి లెనిన్ స్ఫూర్తిగా కొనసాగిస్తామన్నారు. లెనిన్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి గుంటూరు జిల్లా అధ్యక్షులు బొల్లి ముంత కృష్ణ, ఏఐ టియుసి తెనాలి డివిజన్ మరియు ఇస్కాఫ్ తెనాలి డివిజన్ అధ్యక్షులు యస్ గురుబ్రహ్మం, ఇస్కాప్ జిల్లా కార్యదర్శి మునిపల్లి శ్రీకాంత్, ఏఐటియుసి నాయకులు జి వెంకటేశ్వరరావు ,బి శివ శ్రీనివాసరావు ,కె ప్రవీణ్, బోయపాటి నాగరాజ, రాష్ట్ర వార్త ఎడిటర్ కె రమేష్, డి.నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News