Breaking News

భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన

-ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 26 నుండి పాదయాత్ర
-హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర కు వస్తున్న విశేష స్పందన దృష్ట్యా భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టవలసినదిగా అఖిలభారత కాంగ్రెస్ పిలుపునివ్వడం జరిగిందని ఎపిసిసి అధ్యక్షులు  గిడుగు రుద్రరాజు తెలిపారు. సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ విజయవాడ నందు ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మాట్లాడిన ఆయన ఈనెల 26 వ తేదీ నుండి మార్చి నెల 26 వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ (చేయి చేయి కలుపుదాం –  రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం) పేరిట పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈమేరకు పాదయాత్ర పోస్టర్, పాంఫ్లేట్, రాహుల్ గాంధీ లేఖను విడుదల చేసారు. దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 30 వ తేదీన కాశ్మీర్ లో ముగుస్తున్నందున ఆరోజున జమ్మూ & కాశ్మీర్ లో రాహుల్ గాంధీ గారు జాతీయ జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని ముగించనున్నట్లు తెలిపారు. భారత్ జోడో యాత్ర కు దేశ ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన చూసి బి.జె.పి & ఆర్.ఎస్.ఎస్ వర్గాలకు కంటి మీద కునుకు దూరమైందని, ప్రజల్లో వచ్చిన మార్పు రానున్న కాంగ్రెస్ యుగానికి నాంది అని అన్నారు. బీజీపీ ప్రభుత్వ విద్వేష పూరిత కుట్రలను శాంతిమార్గంలో తిప్పికొడుతున్న రాహుల్ గాంధీ ని నేటి మహాత్మా గాంధీ గా రుద్రరాజు అభివర్ణించారు. బిజెపి ప్రభుత్వం దేశ సంపదలను ప్రైవేట్ పరం చేస్తూ, దేశాన్ని అమ్మకానికి పెట్టిందని, ప్రైవేట్ వ్యక్తులకు జాతీయ సంపదను అప్పజెప్పడం వలన దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని మండిపడ్డారు.

ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు పొడిగింపు హర్షణీయం
దళితుల పక్షాన నిలబడి గెలిచిన కాంగ్రెస్
ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు జనవరితో ముగుస్తున్నందున గడువు మరో పదేళ్లు పొడిగించాలని దళితుల పక్షాన నిలబడి పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ కృషి ఫలించిందని, ప్రభుత్వం దిగివచ్చి సబ్ ప్లాన్ చట్ట సవరణ చేసి అమలును మరో పదేళ్లు పొడిగించింది రుద్రరాజు అన్నారు. ఈ పోరాటంలో అలుపెరగని కృషి చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించడం లో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అయిందని ఆనందం వ్యక్తం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *