Breaking News

అభివృద్ధి పనులపై సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ఐ.ఏ.ఎస్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఐ.ఏ.ఎస్ సోమవారం కామండ్ కంట్రోల్ రూమ్ నందు నగరంలోని సెంట్రల్ నియోజకవర్గ పలు అభివృద్ధి పనుల యొక్క పురోగతి మరియు ఇంకను చేపట్టవలసిన చర్యలపై సమీక్షించి పలు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా గుణదల ఆర్.ఓ.బి మరియు మధురానగర్ నందు నగరపాలక సంస్థ అద్వర్యంలో జరుగుతున్న ఆర్.యు.బి నిర్మాణ పనుల వివరాలపై చర్చిస్తూ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సత్వరమే పూర్తి చేయుటకు ప్రణాళికలను రూపొందించుకొని పనులు వేగవంతము చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ శ్రీనివాసు, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *