Breaking News

108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
108 ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ 108 సర్వీసెస్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కె రాఘవులు అన్నారు. గాంధీ నగర్ లోని ధర్నా చౌక్ లో సోమవారం 108 సర్వీసెస్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు రాఘవులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు 108 ఉద్యోగులను ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ లో చేర్చాలని కోరారు. ప్రభుత్వ నియామకాల్లో సంబంధిత విద్యార్హత కలిగిన 108 ఉద్యోగాలకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏఈఏంఎస్ సంస్థ వచ్చిన తర్వాత తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించుకున్నారు. ఈపీఎఫ్ఓ , ఈఎస్ఐ నిమిత్తం ప్రతినెల యాజమాన్య వాటాను యాజమాన్యం వారే చెల్లించాలని, ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించుట కొరకు రోజుకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈఏంటి లకు 30 వేలు, పైలట్ లకు 28 వేలు గా అందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రతి సంవత్సరము ఉద్యోగి వేతనంపై 20 శాతం వేతనం పెంపును అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ 108 సర్వీసెస్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం అమలేశ్వర రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ శివ శ్రీను లు మాట్లాడుతూ కొత్తగా చేరిన ఉద్యోగి ట్రైనింగ్ నిమిత్తం ఒక్కొక్కరు వద్ద నుండి 30 వేల రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు 108 ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *