Breaking News

జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి !!

-కలెక్టర్ పి.రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా ప్రభుత్వం ఉచిత ఇసుక, సబ్సిడిపై సిమెంట్, ఐరన్ అందిచడంతో పాటు, అదనపు రుణాలను కూడా మంజూరు చేస్తుందని, లబ్దిదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సూచించారు.
సోమవారం ఉదయం ఆయన మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళ ‘ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి ‘ఏ’ సెక్టార్ లేఅవుట్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద పలువురు లబ్ధిదారుల హర్షద్వానాల మధ్య రిబ్బన్ కత్తిరించి గృహ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.
తొలుత ఆయన షేక్ కౌసర్ జహ, రాజ అప్పయమ్మ, కొమిరి భవాని, పేర్ల ఆదిలక్ష్మి, వేముల లక్ష్మీ కుమారి, అన్నందాసు సావిత్రమ్మ, షేక్ ఆయుష పర్వీన్, గానుగుల ఎలిజిబెత్, కొత్త బంగారమ్మ, మండ్రు దివ్య తదితర లబ్ధిదారుల ప్లాట్ల వద్ద భూమి పూజ నిర్వహించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేఔట్ లో కలియ తిరుగుతూ వివిధ లబ్ధిదారుల నివేశన స్థలాల వద్ద శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం లబ్ధిదారుల అవగాహన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ, మన రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద లేఔట్ మచిలీపట్నం కరగ్రహారంలో ఉందని అక్కడ గృహ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు.
నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు నిర్మాణానికి ఎటువంటి షరతుల్లేకుండా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయిని, ఈ పథకం కింద ఇంటి రుణం తీసుకునే వారికి సిబిల్‌ స్కోర్‌ అంటే రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలియచేసే విధానం నుంచి కూడా మినహాయిస్తూ రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సైతం నిర్ణయం తీసుకుందని కలెక్టర్ తెలిపారు.
ప్రణాళికా బద్ధంగా పనిచేసి అయా గృహ నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. ఎస్ హెచ్ జి రుణాలు శాతం మంజూరు చేయాలని, సకాలంలో రుణాలు అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయవచ్చని మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లను ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇళ్ల నిర్మాణాల లక్ష్యం సాధనలో ప్రగతి స్పష్టంగా కనిపించాలని, లేని పక్షంలో బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందుగా గృహ సామాగ్రి అందజేసి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ సకాలంలో అందిస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణాలపై సరియైన రీతిలో అవగాహన కల్పించి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకువస్తే అటువంటివారికి మేలు చేకూర్చడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు.
లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, నిర్మాణ పనులు ప్రారభించకపోతే మంజూరైన పట్టా సైతం రద్దు అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన బ్యాంకు రుణం అందించడానికి మెప్మా సిబ్బంది తోడ్పాటు అందిస్తున్నారన్నారు. వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *