Breaking News

ఎపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయడం జగన్‌ సర్కార్‌కు తగదు

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడం జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. తమకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించడం లేదని, ఉద్యోగుల పెండిరగ్‌ బకాయిలు ఇవ్వడం లేదని ఎపీ ఉద్యోగ సంఘం నేతలు రాష్ట్ర గవర్నర్‌కు మొరపెట్టుకున్నారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ పలుమార్లు మంత్రులకు, ముఖ్యమంత్రికి కూడా విన్నవించినప్పటికీ ఫలితం శూన్యం. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు తమ సమస్యల గురించి గవర్నర్‌కు విన్నవించుకున్నారు. గవర్నర్‌ వద్ద ఉద్యోగ సంఘ నేతలు తమ ఇబ్బందులు చెప్పుకున్నారేగాని రాజకీయ అంశాలేవీ ప్రస్తావించలేదు. ఉద్యోగులగోడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పట్టించుకోకపోతే ఎవరికి మొరపెట్టాలి? తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడం నేరమా? అని ప్రశ్నిస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌ చేయడం తగదు. ఉద్యోగసంఘం నేత కెఆర్‌ సూర్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి సరికాదు. గతంలో సిపిఎస్‌ రద్దు, పిఆర్‌సి అమలు కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టిన సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను, అధికారులను ప్రయోగించి ఉక్కుపాదం మోపింది. ప్రజా నిరసనలను అణగద్రొక్కేందుకే జీవో నెం:1 అప్రజాస్వామికంగా తీసుకొచ్చింది.
జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తూ, రాష్ట్రంలో నిరంకుశ విధానాలు అమలు చేస్తున్నారు. అధికార దుర్వినియోగంతో ఉక్కుపాదం మోపుతున్నారు. జగన్మోహనరెడ్డి ఇకనైనా ఈ ధోరణి విడనాడాలని హితవు పలుకుతున్నాం. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం చిత్తశుద్ధి చూపాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *