Breaking News

గాంధీ పార్క్ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ పార్క్ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, ఫిబ్రవరి 30 నాటికి పార్క్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా పనుల వారీగా కాంట్రాక్టర్లకు నిర్దేశిత గడువును విధించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ నగరపాలక సంస్థ ఎస్.ఈ.ని ఆదేశించారు. మంగళవారం కమిషనరు గాంధీ పార్క్ అభివృద్ధి పనులను తనిఖీ చేసి ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పార్క్ పనుల పురోగతి పై ఎస్.ఈ., కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ గాంధీ పార్క్ గుంటూరు నగరానికి కీలకమైనదని, పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇప్పటివరకు పార్క్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ప్లే ఎక్విప్మెంట్స్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారన్నారు. మెయిన్ గేటు ఆర్చి పనులు కూడా వేగంగా జరుగుతున్నా అంతర్గత గ్రానైట్ పరచడం పనులు మందకొడిగా సాగుతున్నాయని, అదనపు కార్మికులను ఏర్పాటు చేసుకొని, పనులను త్వరితగతిన చేపట్టాలని కాంట్రాక్టర్ కు స్పష్టం చేశారు. డైనోసార్ లో ధియేటర్ పనులు కూడా ప్రారంభించాలని, పనులు జరిగిన ప్రాంతాల్లో లాన్ వేయడానికి చర్యలు తీసుకోవలని ఏడిహెచ్ ని ఆదేశించారు. మెయిన్ గేటులో నుండి పార్క్ లోపలి వచ్చే మార్గంలో రోజ్ గార్డెన్, లాన్ తో ఆకర్షణీయంగా తయారు చేయాలని, అలాగే పార్క్ లో సెల్ఫి పాయింట్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్, స్టాల్స్, మరుగుదొడ్ల ఏర్పాటు పక్కాగా ఉండాలన్నారు. పార్క్ అభివృద్ధి పనుల పురోగతి పై ప్రతి రోజు సమీక్షిస్తామని, ఎప్పటికప్పుడు నిర్దేశిత గడువులోగా పనులు జరిగేలా ఎస్.ఈ., ఈ.ఈ.లు నేరుగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ కి సూచించారు. పర్యటనలో ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ.లు కోటేశ్వరరావు, కొండారెడ్డి, డి.ఈ.ఈ.లు శ్రీనివాసరెడ్డి, కళ్యాణరావు, ఏడి.హెచ్. రామారావు, ఏ.ఈ. రవికిరణ్, కాంట్రాక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *