-మంత్రి జోగి రమేష్
ఐదుగుళ్ళపల్లి (గూడూరు), నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సేవలందేలా కృషి చేయాలని ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులకు సూచించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గూడూరు మండల పరిధిలో 7 క్లస్టర్లు 450 ఇల్లు 1200 మంది జనాభా గల ఐదుగుళ్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతంగా పర్యటించారు.
తొలుత ఆయన ఐదుగుళ్లపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన రెబ్బా నాగమల్లేశ్వరి, పామర్తి అమలేశ్వరి, కైలా కోటేశ్వరమ్మ, బెజవాడ సామ్రాజ్యం, కంచర్ల మాధురి, మాతంగి నాగరాణి, గోవాడ మునిమ్మ, బండారు వెంకటేశ్వరమ్మ, గుమ్మడి అనిత, తాడి మణి, గోకపై సుమలత, ఇసుకపల్లి ಜಯకృష్ణ, ఇసుకపల్లి ఈశ్వరి, జల్దుల లక్ష్మి, వెన్నా రామారావు, బేతు రమాదేవి, తాడింకి నళిని తదితరుల గృహాలకు మంత్రి జోగి రమేష్ సందర్శించి అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ప్రజలు పొందిన లబ్ధి వివరాలతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. జగనన్న ప్రభుత్వం రావడం వలన మీకు ఇన్నిన్ని ప్రయోజనాలు చేకూరడం జరుగుతుందని, అలానే పెడన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి జోగి రమేష్ చెప్పారు.
తాడింకి పాములు అనే వృద్ధుడు తనకు ఆరోగ్యశ్రీ ద్వారా కాలికి మూడు ఆపరేషన్ జరిగాయని ప్రభుత్వం తన పట్ల ఎంతో దయతో వ్యవహరించి తనకు ఆ శస్త్ర చికిత్సలు జరిగేలా చూశారని మంత్రి జోగి రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, మన రాష్ట్రంలో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందನ್ನಾರು. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక, అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ ఏర్పాటు అయ్యిందన్నారు. ఈ పథకంలో చికిత్సల సంఖ్యను మరింత పెంచడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందನಿ వివరించారు. 2019 తర్వాత రూ.ఐదు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకం పరిధి లోకి తీసుకువచ్చారని, తద్వారా 1.40 కోట్ల కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 1,700లకు పైగా ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులో ఉన్నాయిని చెబుతూ, ఆంధ్రప్రదేశ్ లో కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని 137 ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్, 17 సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుతోందన్నారు. కరోనా చికిత్సను పథకం పరిధిలోకి తీసుకురావడంతో పాటు, బ్లాక్ ఫంగస్, మిస్–సీ వంటి జబ్బులనూ ఇందులో చేర్చారన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై పడిన పెనుభారం తప్పిందని మంత్రి జోగి రమేష్ చెప్పారు. ఇప్పటికే 2,446 చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకంలో ఉండగా.. తాజాగా మరో 700 రకాల చికిత్సలను పథకంలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐదుగుళ్లపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లుక్కా ఏలేసు,గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన రావు, జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, వైస్ ఎంపీపీలు పిచ్చుక గంగాధర్ రావు, నేతల కుటుంబరావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, గూడూరు రైతు భరోసా కేంద్రం చైర్మన్ పర్ణం మహాలక్ష్మి నాయుడు ( పెదబాబు ) మండల పార్టీ అధ్యక్షులు గోరిపర్తి రవి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోటేపల్లి రత్నాకర రావు, ఐదుగుళ్లపల్లి సర్పంచ్ గోవాడ ప్రేమ్ కుమార్, మాజీ సర్పంచ్ మునిపల్లి బసవయ్య, మాజీ సర్పంచ్ వైస్సార్, ఆత్మూరి శ్రీనివాసు ప్రసాద్, గూడూరు సర్పంచ్ లింగం సులోచన రాణి, సీపీ సీనియర్ నాయకులు తలుపుల వెంకటకృష్ణారావు, గూడూరు తహసిల్దార్ బి.విజయ ప్రసాద్, ఎంపీడీవో సుబ్బారావు, హౌసింగ్ డిఈ అడుసుమిల్లి శ్రీనివాసరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News