విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ రాజేంద్ర సురిస్వర్జి జైన్ గురు మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజేంద్ర సురిస్వర్జీ జైన్ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ నెల 22 నుండి 28వ తేదీ వరకు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. జనవరి 27వ తేదీన సురిశ్వర్జి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని తెలియజేశారు. ఈ విగ్రహ ప్రతిష్ట పరం పూజ మునిరాజ్ శ్రీ డాక్టర్ వైభవ రత్న విజయ జి వారి ఆధ్వర్యంలో జరుగుతుందని కమిటీ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన వచ్చని ట్రస్ట్ సభ్యులు దినేష్ కుమార్ జైన్, బవర్లాల్ జైన్, దినేష్ జైన్, ఘిసలాల్ జైన్ లు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా గుడి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో, రంగురంగుల గొడుగులతో అలంకరించారు. నగరంలోని పలువురు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Prajavartha Online Telugu News