విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 26వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ను పూర్తిస్థాయిలో నిషేధించడం జరుగుతుందని ఎండోమెంట్ ఇంజనీర్ మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డ్ రీజనల్ ఆఫీసర్ టీ. ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. G.o Ms .no 81 తేది 29.11.2022 పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి పర్యావరణ హీ తకరమైన పదార్ధములో తయారు చేయబడిన ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను పూర్తిస్థాయిలో నిషేధించడం జరిగినది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు బదులుగా పర్యావరణ హితకరమైన పదార్ధములతో తయారు చేయబడ్డా మరియు ఫ్యాబ్రిక్ ఫ్లెక్సీలను మాత్రమే అనుమతించబడును. ఈ నిషేదాజ్ఞాలను ఉల్లభించిన వారికి అధికారులు చదరపు అడుగుల ప్లాస్టిక్ ఫ్లెక్సీ ఒక్క ఇంటికి వంద రూపాయలు చొప్పున అపరాధ రుసుమును పెనాల్టీ రూపంలో విధించబడును ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం విజయవాడ ఆధ్వర్యంలో తేదీ 21.12.2022 న పర్యావరణ హితకర ఫ్లెక్సీలను ముద్రించి మహారాష్ట్ర తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ముద్రణ సంస్థలతో రాష్ట్రస్థాయి ఎక్స్పో ఒకటి ఫ్లెక్సీ బ్యానర్ల యూనిట్లు యజమానియాలను ఆహ్వానించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది కావున పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను ముద్రించు యూనిట్ల యజమానులు అందరూ పర్యావరణ హితకరమైన ఫ్లెక్సీల ముద్రణ వైపు చర్యలు తీసుకుని పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వులు కనుగోనంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరడమైనది అన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News