Breaking News

చిన్నారులు మత్తు పదార్థాల విష సంస్కృతికి బానిస కాకుండా చర్యలు తీసుకోవాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
యువత మత్తుపదార్థాల వాడక విష సంస్కృతి నుండి బానిస కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలిని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లో మంగళవారం పోలీస్‌, విద్య, వైద్య ఆరోగ్య, మహిళాభివృద్ధి, సంఫీుక సంక్షేమం తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువత ముఖ్యంగా చిన్నారులు మత్తు పదార్థాల విష సంస్కృతికి బానిస అవుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ముఖ్యంగా నగర పరిధిలోని మురికి వాడలలో మత్తుపదార్థాల వినియోగం జరుగుతున్నట్లు దీనిపై పోలీస్‌, రెవెన్యూ, విద్య, స్వచ్చంద సంస్థలు టీములుగా ఏర్పడి నిఘా ఉంచాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాలలోని వాలంటీర్లు, ముఖ్యంగా మహిళా పోలీస్‌ సేవలను వినియోగించుకుని సమాచారాన్ని తెలుసుకుని నిఘా పెట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు ముఖ్యంగా మెడికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు, వసతి గృహాల పరిధిలో మత్తుపదార్థాలు, అమ్మకాలు నిర్వహించకుండా పర్యవేక్షించాలన్నారు. నగర పరిధిలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ జోన్‌లుగా విభజించుకుని ఆయా ప్రాంతాల పరిధిలో మత్తుపదార్థాల అమ్మకాలు, వాడకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అరికట్టాలన్నారు. పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మత్తుపదార్థాలను చాక్లెలైట్‌, సిగరెట్ల రూపంలో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే తక్షణమే దాడులు నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు.
సమావేశంలో అడిషినల్‌ సిపి పి. వెంకటరత్నం, డిఇవో సివి రేణుక, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, సంఫీుక సంక్షేమ అధికారి యం వి విజయభారతి, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *