Breaking News

రోడ్డు భద్రతపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించండి..

-ద్విచక్ర వాహన దారులు నిబంధనలను తప్పక పాటించేలా చర్యలు తీసుకోండి..
-నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు భద్రతపై ప్రజలలో అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించాలని ద్విచక్ర వాహనదారులు నిబంధనలను తప్పక పాటించాల్సిందేనని, అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు.
34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్థన్‌లు కలెక్టరేట్‌ నుండి ప్రారంభించారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 50 శాతంకి పైగా ద్విచక్ర వాహనాలే కారణమన్నారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం ఇద్దరకు మించి ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయడం ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రమాదాల కారణంగా వాహన చోదకులతో పాటు వారి కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్‌రూల్స్‌ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించడం, మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించడం పై విద్యార్థులను చైతన్యవంతులుగా చేసేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అతిక్రమించిన కేసులు పునరావృతం అయితే లైసెన్స్‌లను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
కార్యక్రమంలో డిప్యూటి ట్రాన్స్‌పోర్టు కమీషనర్‌ యం. పురేంద్ర, రవాణా శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *