-బాలికలు మహిళల సమస్యల పరిష్కారానికి సాథి సేవలకు శ్రీకారం..
-బాలికల భద్రత సామాజంలో ప్రతి ఒక్కరి భాధ్యత..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలికల భద్రత సామాజంలోని ప్రతి ఒక్కరి భాధ్యత అని బాలికలు, మహిళలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ‘‘సాథి’’ (స్నేహితురాలు) ఆన్‌లైన్ రిడ్రెసల్ మెకానిజానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కళాశాలలో కోర్ కమిటీలను ఏర్పాటు చేసి ‘‘సాథి’’ సహకారంతో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన బాలికల దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్థన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు ముఖ్య అతిధిలుగా హాజరై ‘‘సాథి’’ అన్‌లైన్ గూగుల్ మెయిల్‌ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మట్లాడుతూ బాలికలు, మహిళల సమస్యల పరిష్కారానికి మార్పు ట్రస్ట్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ‘‘సాథి’’ ఆన్‌లైన్ రిడ్రెసల్ మెకానిజానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జిల్లాలో సుమారు 300లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో వేలాది మంది విద్యను అభ్యసిస్తున్నారన్నారు. బాలికలు దైనందిక జీవితంలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వారి సమస్యలను బహిరంగ పరచలేక తోటివారి దృష్టికి తీసుకురాలేక సతమతమౌతున్నారన్నారు. బాలికలు, మహిళల సమస్యల పై 112 `100 పోలీస్ 181 ఉమెన్ హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ల ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరింస్తున్నారన్నారు. మార్పు ట్రస్ట్ ద్వారా కళాశాలలో ఉత్సహవంతులైన నాలుగురు విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలుతో కోర్ కమిటీని నియమించి ‘‘సాథి’’ షసషషఅ్‌తీస్‌ంaa్‌ష్ట్రఱఏస్త్రఎaఱశ్రీ.షశీఎ గూగుల్ మెయిల్‌లో నమోదైన సమస్యలకు సంబంధించిన సమాచారం ముందుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి వస్తుందని సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగాలకు తెలియజేసి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సాథి గూగుల్ మెయిల్ ద్వారా సమస్యలను తెలియచేసేవారి వివరాలను గోప్యంగా వుంచడం జరుగుతుందన్నారు. మహిళలు బాలికలు వారికి సంబంధించిన సమస్యలనే కాకుండా సమీపంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సాథి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడంలో భాగస్వామ్యులు కావాలని డిల్లీరావు అన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణు వర్థన్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు బాలికల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బాలికలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసి పరిష్కరించుకోవాల్సిన అవసరం వుందన్నారు. మహిళలపై లైంగిక వేదింపులు, అత్యాచారాలను అరికట్టడం సమాజంలోని ప్రతి ఒక్కరి భాధ్యతగా గుర్తించాలన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వివిధ రంగాలలో రాణించిన సావిత్రిబాయి పూలే, కవితరావు, ప్రతిభా దేవిసింగ్ పాటిల్, ఇందిరాగాంధి, పునితా అరోరా, ప్రియా జింగాన్, అన్నాజార్జీ, కిరణ్‌బేడి, తదితరుల ధైర్య సహసాలను నేటి బాలికలు ఆదర్శంగా తీసుకుని జీవితంలో రాణించాలన్నారు.
అనంతరం బాలికల దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 20వ తేదిన వైద్య ఆరోగ్య విద్యా శాఖలు ఆధ్వర్యంలో సేవ్ ద చైల్డ్ గర్ల్ అంశంపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తుత్వ పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన బాల బాలికలకు నగదు ప్రోత్సాహకాల సర్టిఫికేట్లను జిల్లా కలెక్టర్ డిల్లీరావు మేయర్ భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌లు అందజేశారు.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్ అవుతు శైలజారెడ్డి, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, మార్పు సంస్థ డైరెక్టర్ సూయజ్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, యం తిరుపతమ్మ, విజయలక్ష్మి, కె. మల్లేశ్వరి, వై తిరుపతమ్మ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపివోలు జి. మంగమ్మ, టి. నాగమణి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, వివిధ కళాశాలల అధ్యాపక సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News