Breaking News

బాలికలు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో రాణించాలి..

-అంధ బాలికలకు బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు..

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
బాలికలకు అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదిగి ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో రాణించగలమని నిరుపించుకుంటారని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు బాలికలకు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గుణదలలోని విజయ మేరీ అంధ విద్యార్థుల పాఠశాలలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన అనంతరం వేదికకు చేరుకుంటున్న జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుకు అంధ విద్యార్థినులు స్వాగతం పలికారు.అంధ బాలికలతో కొద్ది సేపు ముచ్చటించి బాలికల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసి ఉత్సాహపరిచారు.
బాలికలు నేడు అన్ని రంగాలలో ముందుంటున్నారన్నారు. విద్యారంగంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే, తొలి వైద్యరాలు కవితరావు, తొలి మహిళా రాష్ట్ర పతి ప్రతిభా దేవిసింగ్‌ పాటిల్‌, మహిళ ప్రధాని ఇందిరాగాంధీ, మహిళా వ్యోమోగామి పునితా అరోరా, సైనికురాలు ప్రియా జింగాన్‌, ఐఎఎస్‌ అధికారిణి అన్నాజార్జీ, ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌బేడి, మహిళ క్రీడాకారులు కరుణం మల్లేశ్వరి, పివి సింధు, సానియా మీర్జా,మహిళ పైలట్‌ సర్లా తకరాల్‌, తదితరులను ఆదర్శంగా తీసుకుని జాతీయ అంతార్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని బాలుర కంటే బాలికలే ప్రతిభ కనపరుస్తున్నారన్నారు. భవిష్యత్‌లో లింగవివక్షకు తావులేకుండా స్త్రీ, పురుషుల సమానత్వ సమాజం ఏర్పడాలని ఆకాంక్షిస్తూ బాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *