విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు డివిజన్ లో ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత వైస్సార్సీపీ దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో 15వ డివిజన్ సాయిరాం కట్ పీసెస్ రోడ్డు వద్ద దాదాపు 69లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోయే అవుట్ ఫాల్ డ్రైన్స్ మీద గ్రిల్స్ నిర్మాణలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్ లో దాదాపు 10కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ డివిజన్ ను దత్తత తీసుకున్న అని కపట నాటకాలు ఆడి తరువాత అసలు ఈ డివిజన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మాత్రమే ఈ డివిజన్ లో అభివృద్ధి జరిగింది అని తరువాత మరలా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే అభివృద్ధి జరిగింది అని ప్రజలు వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు మరియు డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News