Breaking News

పేదల జీవ‌న ప్రమాణాల పెంపుద‌ల‌కు కృషి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమ‌మే ధ్యేయంగా.. పేదల జీవన ప్రమాణాల పెంపుదలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయం పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. సూర్యనారాయణ రావు వీధిలో విస్తృతంగా పర్యటించి 194 ఇళ్లను సందర్శించారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై పాదయాత్ర కొనసాగించారు. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు.. ఇలా అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. వీటన్నింటిపై యాక్టన్ టేకెన్ రిపోర్టును సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని మల్లాది విష్ణు తెలిపారు. మెరుగైన పాలనకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశించారు.

సచివాలయ పరిధిలో రూ. 2.99 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 93 వ వార్డు సచివాలయ పరిధిలో 2 కోట్ల 99 లక్షల 2 వేల 603 రూపాయల సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 175 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 104 మందికి రూ. 14.56 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 57 మందికి రూ. 16.82 లక్షలు., చేయూత ద్వారా 70 మందికి రూ. 13.12 లక్షలు., కాపు నేస్తం ద్వారా 13 మందికి రూ. 1.95 లక్షలు., వాహనమిత్ర ద్వారా 8 మందికి రూ. 80 వేలు., జగనన్న తోడు ద్వారా 13 మందికి రూ. 1.30 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం పవన్ మానుకోవాలి
చ‌రిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, విద్య, వైద్యం, పాలన రంగాల్లో మెరుగైన ప్రగతి కోసం ఈ ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోందన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఓవైపు చంద్రబాబు పుత్రుడు, మరోవైపు దత్తపుత్రుడు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. 2014 లో అధికారంలో ఉన్నప్పుడు విమానాలు, విదేశాలు తప్ప ప్రజల కష్టాలు ఏనాడూ గుర్తించని నాయకులు.. అధికారం పోయే సరికి రోడ్ల మీదకు వస్తున్నారన్నారు. పదవుల్లో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహించడం తెలుగుదేశం నేతలకే చెల్లిందన్నారు. ప్రజల కోసం చేసేది పాదయాత్ర అని.. పదవుల కోసం చేసేది ప్రాధేయ యాత్ర అవుతుందని మల్లాది విష్ణు విమర్శించారు. రాష్ట్రంలో ఒక సిద్ధాంతం, అజెండా అంటూ లేని పార్టీ ఏదైనా ఉందంటే.. అది జనసేన పార్టీ అని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లో, మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లడమే ధ్యేయంగా ఆ పార్టీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. మూడు రాష్ట్రాల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను ఇకనైనా పవన్ మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, నాయకులు చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, పసుమర్తి రాజేష్, ఆత్మకూరి వెంకట అప్పారావు, గాజుల శేషజ్ఞ, చాందిని, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *