Breaking News

నేటి నుండి ఖాదీ ఫెస్ట్ 2023

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఖాది గ్రామీణ పరిశ్రమల కమిషన్ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వ ర్యంలో మార్కెటింగ్ ఎగ్జిబిషన్ ఖాది ఫెస్ట్ 2023 ప్రారంభిస్తున్నట్లు ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ స్టేట్ డైరెక్టర్ ఎస్ గ్రీప్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో సుమారుగా 50 యూనిట్ల ఖాదీ గ్రామీణ ప్రాంతం వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులను ప్రదర్శిన ద్వారా అమ్మకానికి ఉంచుతారని తెలియజేశారు. మార్కెటింగ్ ఎగ్జిబిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఖాదీ ఉత్పత్తులను, గ్రామీణ పరిశ్రమల సంస్థలను ప్రోత్సహించటం, గ్రామోద్యోగ ఉత్పత్తుల ప్రచారం, ఉత్పత్తి అమ్మకాలు, ఉపాధి కల్పనక ‘ఆర్థిక మద్దతును అందించటం అని సాంకేతిక వివరించారు. ఖాదీ ఎగ్జిబిషన్ నేటి నుండి ఫిబ్రవరి 6 తేదీ వరకు నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఖాదీ ఉత్పత్తులను చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించ వలసినదిగా గ్రీప్ కోరారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా విజయ వాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా మెజిస్ట్రేట్ ఎం ఎం నాయక్, శాసనమండలి సభ్యులు ఎం.డి రుహుల్లా, ఏపీ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ చైర్ పర్సన్ పి భాగ్యమ్మ, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వి కోటిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర కుమార్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *