-టిడ్కో గృహాలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడలో మల్లాయపాలెం టిడ్కో గృహా సముదాయాలలో మౌలిక వసతులు అభివృద్ధి పనులు ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కొడాలి నాని మల్లాయపాలెం టిడ్కో గృహాలు సందర్శించి మౌలిక వసతుల అభివృద్ధి పనులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అన్ని బ్లాకుల్లో పర్యటించి నిర్మిస్తున్న సిసి రోడ్లు డ్రైన్లు గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణం పనులు డ్రైనేజీ నిర్మాణ పనులు నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో ముఖ్యమంత్రి టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించనున్నారని, ఈలోగా అన్ని బ్లాక్ లలో పవర్ సప్లై,వాటర్ సప్లై పనులు పూర్తి చేయాలన్నారు లేఅవుట్కు ఆర్చ్ నిర్మించాలన్నారు అంతర్గత రహదారులు నిర్మాణం వేగవంతం గావించాలని మౌలిక వసతులు పనులు 80% పైగా పూర్తయ్యాయి అన్నారు. అనంతరం ఇదే లేఔట్ ప్రక్కన జగనన్న లేఔట్ సందర్శించి గృహ నిర్మాణాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుడివాడలో 77 ఎకరాలలో 9,000 మంది లబ్ధిదారులకు ఒకే చోట టిడ్కో గృహాలు నిర్మించినట్లు రాష్ట్రంలోనే అతిపెద్ద టిడ్కోలేఆవుట్ కాగలదని తెలిపారు. దీని ప్రక్కనే మరో 7 వేల ప్లాట్లతో 180 ఎకరాల్లో లే ఓటు వేసి లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు.
గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి సంకల్పాన్ని అమలు చేసే దిశగా అధికారులు నిరంతర కృషి చేస్తున్నారని అన్నారు గుడివాడ నియోజకవర్గ పరిధిలో 25 వేల మందిని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా టిట్కోలేవుట్లో 9000, జగనన్న లేఔట్ లో 7000 మొత్తం 16000 గృహాలు మల్లాయపాలెం లోనే నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా 6000 మందికి టిట్కో గృహాలు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డిఓ పద్మావతి, టిడ్కో పి.ª¯[ చిన్నోడు, మున్సిపల్ కమిషనర్ మురళి, రెవిన్యూ మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News