Breaking News

YSR జగనన్న శాశ్వత భూ-హక్కు-భూరక్ష పథకము రీ సర్వే పై సమీక్ష : జిల్లా జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
YSR జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకము అనుసరించి జిల్లాలో ఉన్న మండల డిప్యూటీ సర్వేయర్లు, సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ల్ , ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అందరితో జిల్లాలో జరుగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూథింగ్, గ్రౌండ్ వ్యాలీడేషన్ 9(2) నోటీలుసు, అప్పీల్స్ పై మరియు అసైన్మేంట్ భూముల వివరములు చేపట్టవలసిన కార్యాచరణ పై శనివారం మధ్యాహ్నం స్ధానిక కలెక్టరేట్ నందు సమావేశ మందిరంలో తిరుపతి జాయింట్ కలెక్టర్ డి .కె బాలాజీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు దాదాపు 100 సంవత్సరాల తరువాత మనం అందిస్తున్న భూ హక్కు పత్రాలు స్వ చ్చికరణ ఉండాలని అన్నారు. ఉండాలనిజిల్లాలో భూ రికార్డులు స్వచ్చి కరణ ,6(A) వెబ్ ల్యాండ్ కరెక్షన్స్, సబ్ డివిజన్స్ భూముల పై తనిఖీ చేసి ఓ ఆర్ ఐ మ్యాప్స్ నందు క్వాలిటీ చెక్ చేసి భూమిని మరియు రికార్డులుని పరిశీలించి అప్డేషన్స్ ని విలేజ్ సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి మరియు రీ సర్వే ఉప తహసీల్దార్, మండల సర్వేయర్ ద్వారా రికార్డులను నవీకరణ చేయాలని సూచించారు.. అలాగే రీ – సర్వేల్లో వచ్చే సమస్యలను గురించి చర్చిస్తూ నివృత్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస రావు, సర్వే లాండ్ రికార్డ్ స్ ఏ డి పి. జయరాజ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మరియు డివిజన్లు, మండల స్థాయి సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *