Breaking News

పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం…

-విద్యార్థులు సబ్జెక్టుల పై పట్టు సాధించేలా విద్య బోదన అందిస్తున్నాం.. కలెక్టర్‌ డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు సబ్జెక్టులపై పట్టు సాదించేలా విద్యబోదన అందించి ఉత్తమ ఫలితాలను సాధించడంతో పాటు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు. స్థానిక పాయకాపురం ప్రభుత్వ జానియర్‌ కళాశాలను శనివారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సందర్శించి ఇంటర్‌మీడియట్‌ విద్యార్థుల విద్యాబోదనను పరిశీలించారు. జువాలజీ బోటని సబ్జెక్టులపై జిల్లా కలెక్టర్‌ విద్యార్థులకు పలు ప్రశ్నలను అడిగి సమాదానాలను రాబట్టి విద్యా బోదన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు వారు ఎంచుకున్న సబ్జెక్లులపై పూర్తి పట్టును సాధించేలా ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యా బోదనను అందిస్తున్నామన్నారు. సబ్జెక్టులలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోదన అందించాలని ప్రిన్సిపాల్స్‌కు సూచించడం జరిగిందన్నారు. సబ్జెక్టులలో ప్రతిభ కనపరిచే విద్యార్థులు వారు నేర్చుకున్న పాఠ్యాంశాలను మిగిలిన విద్యార్థులకు బోదించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించేలా ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సిద్దం చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి అదునాతన భవనాలను నిర్మించి మౌలిక వసతులను కల్పించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోదనను అందించడం జరుగుతుందన్నారు. నాడు`నేడు ద్వారా జిల్లాలో 598 పాఠశాలలు, కళాశాలల భవనాలను కోట్లాది రూపాయల వ్యయంతో ఆధునీకరించి పాఠశాలలకు రూపురేఖలను మార్చడం జరిగిందన్నారు. పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సుమారు 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు, టాయిలెట్స్‌, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, గ్రీన్‌ చాక్‌ బోర్డుల ఏర్పాటు, త్రాగునీరు సౌకర్యం కల్పించడంతో పాటు పెయింటింగ్‌ పనులు పూర్తి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. కళాశాల పరిశీలనలో జిల్లా కలెక్టర్‌ వెంట ప్రిన్సిపాల్‌ సిఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, అధ్యాపకులు కె. బాలరాజు, యం నిర్మలజ్వోతి, కె. శేఖర్‌బాబు, డి.సంధ్యారాణి, సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పి. గంగరాజు, స్థానిక తహాశీల్థార్‌ సిహెచ్‌ దుర్గాప్రసాద్‌, విఆర్‌వోలు నరేంద్ర, చైతన్య, జి.వి.ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *