Breaking News

ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని ఆశీసులతో ప్రజలు సుభిక్షంగా జీవించాలి..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా జీవించేలా సకల జీవకోటి ప్రాణదాత ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని ఆశీస్సులను అందించాలని కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. రథసప్తమి పుణ్యదినాన్ని పురస్కరించుకుని స్థానిక బృందావన్‌ కాలనీలలో పిఆర్‌ఎల్‌ ప్రసాద్‌, రమాదేవి దంపతుల సహకారంతో శనివారం బెంగుళూరు చెందిన శ్రీ శ్రీ శ్రీ మధురకవి జీయర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమం పూజ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు హాజరై జీయర్‌ స్వామి ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సకల జీవకోటికి ప్రాణదాత అయిన సూర్యభగవానునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు రథసప్తమి సూర్యడు మక్రర రాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభం రోజు రథసప్తమిగా పిలవబడుతుంది. రథసప్తమి రోజు భారతీయులు పవిత్ర దినంగా భావించి సూర్యభగవాన్ని ఆరాధిస్తారన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని సూర్య దేవాలయంలో అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలను నిర్వహిస్తారన్నారు. సూర్యభగవానుని అనుగ్రహం లేనిదే ప్రపంచంలోని సమస్త జీవరాశికి మనుగడలేదన్నారు. సూర్యడు లేనిదే సృష్టి లేదని, పంచభూతాలలో అంత్యత విశిష్టత కలిగిన సూర్యభగవానునికి రథసప్తమి రోజున ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ శ్రీ శ్రీ శ్రీ మధురకవి జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలలో పాల్గొన్ని ఆయన ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నాని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. కార్యక్రమంలో 31వ వానమామలై పిఠానికి చెందిన స్వామిజీ శిష్యులు ప్రసన్న కనకవల్లి, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *