Breaking News

జగనన్న చేదోడు గా జిల్లాలోని 13491 మంది లబ్ధిదారులకు రూ.13.49కోట్లు జమ..

-లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి సోమవారం రూ.10 వేలు చొప్పున జమ
-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న చేదోడు పథకం క్రింద ఈ నెల 30వ తేదీ సోమవారం 3 వ విడత సహాయాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభ ద్వారా బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో మూడో విడత ఆర్థిక సహాయాన్ని జమ చేయనున్నారు.

జిల్లాస్థాయి కార్యక్రమం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సహాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాలకు జనం చేయనున్నదని పేర్కొన్నారు. ఈ పథకం కింద జిల్లాలో గత రెండు విడతలుగా 12181 మంది లబ్ధిదారులకు రూ. 22.12 కోట్లు అందజేయడం జరిగిందన్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరంగా సంబంధించి ఈ ఏడాది జిల్లాలో 13491 మంది లబ్ధిదారులకు రూ.13.49 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సోమవారం జమ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంగా సంబంధించి ఈ ఏడాది  రాష్ట్రస్థాయిలో 3,30,145 మంది లబ్ధిదారులకు రూ. 330.14 కోట్లు వారి ఖాతాల్లో సోమవారం పల్నాడు జిల్లా వినుకొండ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని వారు ఖాతాల్లో జమ చేయనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *