-జిల్లాలో ఈ ఏడాది 16,583 మందికి 16 కోట్ల 59 లక్షల లబ్ది..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యం రెక్కాడితేనే గాని డొక్కాడని రజక, నాయి బ్రాహ్మణ ధర్జీ వృత్తి దారులకు ‘‘జగనన్న చేదోడు’’ ను అందించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఏడాది 16,583 మంది లబ్దిదారులకు 16 కోట్ల 59 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రజక, నాయి బ్రాహ్మణ ధర్జీలకు ఆర్ధిక సాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ లబ్దిదారులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం జిల్లాకు సంబంధించి లబ్దిదారులకు ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ రజక, నాయి బ్రాహ్మణ ధర్జీ వృత్తి దారులు నిత్యం వారి వృత్తిపై ఆదారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. రజక, నాయి బ్రాహ్మణ, ధర్జీల ఆర్థిక పరిస్థితులను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న చేదోడును అందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. జగనన్న చేదోడు పథకంలో భాగంగా ఇస్త్రీ షాపులున్న రజకులు, బార్బర్ షాపులున్న నాయి బ్రాహ్మణులు, టైలర్ షాపులున్న దర్జీలకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 2022`23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 16,583 మంది దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణలకు 16 కోట్ల 59 లక్షల రూపాయలను నేరుగా ముఖ్యమంత్రి వారి ఖాతాలకు నేడు జమ చేశారన్నారు. 11,356 మంది దర్జీలకు 11 కోట్ల 36 లక్షలు, 3,576 మంది రజకులకు మూడు కోట్ల 58 లక్షలు, 1651 మంది నాయి బ్రాహ్మణులకు కోటి 65 లక్షల రూపాయలు మొత్తంగా 16,583 మంది లబ్దిదారులకు 16 కోట్ల 59 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.2020`21 ఆర్థిక సంవత్సరంలో 15,700 మంది రజకులు, నాయి బ్రాహ్మణులు దర్జీలకు 15 కోట్ల 70 లక్షలు, 2021`22 ఆర్థిక సంవత్సరంలో 15,035 మంది లబ్దిదారులకు 15 కోట్ల నాలుగు లక్షలతో రెండు సంవత్సరాలలో 30 వేల 735 మంది లబ్దిదారులకు 30 కోట్ల 73 లక్షల ఆర్థిక సహాయం అందించామని కలెక్టర్ డిల్లీరావు వివరించారు.
కార్యక్రమంలో డిప్యూడి మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, గౌడ నాయిబ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కనకరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ శిమరామ కృష్ణ, బటరాజు కార్పొరేషన్ చైర్మన్ గీతాంజలిదేవి, జిల్లా గంథలయ సంస్థ్ చైర్మన్ జమల పూర్ణమ్మ లబ్దిదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News