Breaking News

‘‘కుష్టు’’ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్య సహాయం అందించి ‘‘కుష్టు’’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చేయి చేయి కలుపుదామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. కుష్టు వ్యాధి నివారణ అవగాహనకు నిర్వహించే ‘‘స్పర్శ’’ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కుష్టు వ్యాధి లక్షణాలపై వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్లను కరపత్రాలను సోమవారం స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి నివారణకు ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న రోగులను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య సహాయం అందించగలిగితే వ్యాధిని త్వరితగతిన నివారించవచ్చునన్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చెవులు, వీపు, ఎదపై నొప్పి లేని బొడిపెలు, కనుబొమ్మలు రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడకపోవడం, ముక్కు దిబ్బడ, ముక్కు నుండి రక్తం కారడం, కాళ్ళు, చేతులు తిమ్మిర్లు, అరికాళ్ళు, అరిచేతులలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, చేతివేళ్ళు, కాళ్ళ వేళ్ళు వంకర్లు తిరిగి అంగవైకల్యం లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షించి వ్యాధి నిర్థారణ చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించేందుకు జనవరి 30వ తేది నుండి ఫిబ్రవరి 13వ తేది వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు ప్రతి ఆరోగ్య కేంద్రంలోను ఆరోగ్య కార్యకర్త వద్ద యండిటి మందులను అందుబాటులో ఉంచి ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేయి చేయి కలిపి భాగస్వామ్యులై స్పర్శ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం కుష్టు, టిబి వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పంపిణీ చేశారు. పోస్టర్లు, కరపత్రాల విడుదల కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌ కుమార్‌, డిఎం హెచ్‌వో డా.యం సుహాసిని, జిల్లా లెప్రసి ఎయిడ్స్‌ టి.బి అధికారిణి జె. ఉషారాణి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *