తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడో విడత జగనన్న చేదోడు రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు రూ. 330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో గౌ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి సోమవారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబంధిత అధికారులతో, లబ్ధిదారులతో హాజరై సి.ఎం గారి సమావేశ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలు అధిక వడ్డీలకు ఇతరులను ఆశ్రయించరాదని ఆర్థికంగా వారు ఎదగాలనే సదుద్దేశ్యంతో కుల వృత్తి చేసుకునే దుకాణాలు కలిగిన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం అర్హత కలిగిన లబ్ధిదారులకు సంవత్సరానికి 10 వేల చొప్పున ఐదు సంవత్సరాలు 50 వేలు అందిస్తున్న ఆర్థిక సహాయం జగనన్న చేదోడు అని దాని ద్వారా వారి వృత్తిని అభివృద్ధి చేసుకునేందుకు వినియోగించుకోవాలి అని, చేదోడు మూడవ విడత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా నుండి జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. జిల్లాలోని 10813 మంది లబ్ధిదారులకు రూ.10 వేల వంతున వ్యక్తిగత ఖాతాలకు జమ చేయనున్న మొత్తం రూ.10.813 కోట్లు మెగా చెక్కును కలెక్టర్ అందచేశారు. ఇందులో టైలర్స్ 6122, రజకులు 3567, నాయి బ్రాహ్మణులు 1124 మందికి లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. జగనన్న చేదోడు 2020-21 సం. కి గాను 8526 మంది లబ్ధిదారులకు రూ. 8.53 కోట్లు, 2021-22 సం. కి గాను 9392 మంది లబ్ధిదారులకు రూ. 9.39 కోట్లు లబ్ధి చేకూరింది అని గుర్తు చేశారు. అర్హత ఉండి ఎవరికైనా జగనన్న చేదోడు అందకుంటే వారు మళ్ళీ సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెరిఫై చేసి సోషల్ ఆడిట్ అనంతరం వచ్చే జూన్, డిసెంబర్ నెలలో అర్హత మేరకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు.
నియోజకవర్గాల వారీగా లబ్దిదారుల వివరాలు: చంద్రగిరి – టైలర్స్ 1120, రజక 653, నాయీ బ్రాహ్మణ 204 (మొత్తం 1979 మంది లబ్దిదారులు), గూడూరు – టైలర్స్ 1551, రజక 902, నాయీ బ్రాహ్మణ 286 (మొత్తం 2739), నగరి (జిల్లాలోని రెండు మండలాలు) – టైలర్స్ 274, రజక 159, నాయీ బ్రాహ్మణ 51 (మొత్తం 484), సూళ్లూరుపేట – టైలర్స్ 727, రజక 423, నాయీ బ్రాహ్మణ 135 (మొత్తం 1285), సత్యవేడు – టైలర్స్ 496, రజక 289, నాయీ బ్రాహ్మణ 92 (మొత్తం 877), శ్రీకాళహస్తి – టైలర్స్ 895, రజక 521, నాయీ బ్రాహ్మణ 163 (మొత్తం 1579), తిరుపతి – టైలర్స్ 964, రజక 564, నాయీ బ్రాహ్మణ 176 (మొత్తం 1704), వెంకటగిరి ( 3 మండలాలు) – టైలర్స్ 95, రజక 56, నాయీ బ్రాహ్మణ 17 (మొత్తం 168) జిల్లా మొత్తం 10,813 మందికి రూ.10 వేలు వంతున రూ.10,81,30,000 /- మెగా చెక్కును లబ్దిదారులకు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇన్చార్జి అధికారి భాస్కర్ రెడ్డి, బి సి కార్పొరేషన్ ఏ ఈ ఓ బాబు రెడ్డి, బి సి సంక్షేమ శాఖ, కార్పొరేషన్ సిబ్బంది, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News