Breaking News

వినియోగదారుడు తప్పనిసరి ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాలు గల వాటినే ఉపయోగించాలి : డి.ఆర్.ఓ.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులు, అధికారులు బి.ఐ.ఎస్. చట్టం – 2016 మేరకు గుర్తింపు పొందిన 458 వస్తువుల కొనుగోలులో దైనందిన జీవితంలో మోసపోరాదని ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాలు (ఐ.ఎస్.ఓ) పాటించాలని ప్రభుత్వ శాఖలలో తప్పనిసరి అమలయ్యేలా చూడాలని జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి.ఐ.ఎస్) విజయవాడ వారు నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. బి.ఐ.ఎస్. జాయింట్ డైరెక్టర్లు సుజాత మరియు రమాకాంత్ సాగర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వస్తువుల కొనుగోలు విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు, లైసెన్స్ లేని విక్రేతలకు జైలు శిక్ష, జరిమానాలు వంటివి ఉంటాయని వినియోగదారులు అవగాహనతో బి.ఐ.ఎస్. వెబ్ సైట్ ను పరిశీలించి కొనుగోలు చేసే విధంగా ఉండాలని బి.ఐ.ఎస్. లో లైసెన్స్, గుర్తింపు పొందిన వస్తువులు నాణ్యతా ప్రమాణాలు ఉంటాయని వాటిలో సిమెంట్, స్టీల్, మెడికల్ ఎక్విప్మెంట్లు, బంగారం, తినుబండారాలు, ఎలెక్ట్రికల్ పరికరాలు ప్రధానమని అన్నారు. కొనుగోలు సమయంలో బి.ఐ.ఎస్ కేర్ యాప్ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని పరిశీలించాలని నాణ్యతా ప్రమాణాలు లేకపోతే మొబైల్ యాప్ నుండే ఫోటో కంప్లైంట్ చేయవచ్చని అన్నారు.

జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ఐ.ఎస్.ఐ. వస్తువులు కొనుగోలు వల్ల వినియోగదారునికి ఇబ్బందులు ఉండవని, మోసపోవడం వంటివి జరగవని అన్నారు. వస్తువు కొనుగోలు సమయంలో ప్రభుత్వం సూచించిన యాప్ ద్వారా హాల్ మార్క్ పరిశీలించి కొనుగోలు చేస్తే ప్రమాదాల నివారణతో పాటు, పాడైన వస్తువులు మార్పిడికి అవకాశం కలుగుతుందని అన్నారు. బి.ఐ.ఎస్. అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రభుత్వ నిర్మాణాలు వినియోగ వస్తువులు ఇండియన్ స్టాండర్డ్స్ ఉండేలా చూడాలని అన్ని జిల్లాలలో అవగాహన కల్పిస్తున్నారని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ అవగాహనా కార్యక్రమం డి.ఎస్.ఓ. ప్రసాద్ సమన్వయంతో నిర్వహించగా జిల్లా అధికారులు పాల్గొని తమ శాఖలకు సంబందించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *