Breaking News

నేటి స్పందనలో 101 అర్జీలు నమోదు…

-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలకు తక్షణ పరిష్కరం చూపాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేధిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ డిల్లీరావు జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. గడువు తీరిన అర్జీలు ఉండరాదన్నారు. ఎక్కువగా నమోదవుతున్న రెవెన్యూ, నగరపాలక సంస్థ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పోలీస్‌ తదితర శాఖల అధికారులు అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ ఫిర్యాదు పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెడుతుందని అర్జీదారులకు సత్వర న్యాయం చేయడమే లక్ష్యంగా అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోవడం, ఎవరికైనా అన్యాయం జరిగిన సందర్భంలో ఫిర్యాదు వస్తే విచారించి నిర్థేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. ఏపి సేవా డాష్‌ బోర్డులో జిల్లాకు చెందిన అర్జీల పెండిరగ్‌ ఎక్కువగా ఉన్నాయని, ఆయా శాఖల అధికారులు పెండిరగ్‌ లేకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు.
నేటి స్పందనలో 101 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 38 అర్జీలు నమోదు కాగా, పోలీస్‌ శాఖ 18, యంఎయుడి 11, పంచాయతీరాజ్‌ 5, ఏపిఎస్‌పిడిసిఎల్‌ 5, సర్వే అండ్‌ సెటిలిమెంట్‌ 4, వైద్య ఆర్యోగ శాఖ 3, దేవాదాయ శాఖ 3, డిఆర్‌డిఏ 2, విద్య 2, మార్కెటింగ్‌ 2, స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ 1, గనులు భూగర్భ శాఖ 1, విభిన్నప్రతిభావంతులు 1, ఉపాధి కల్పన 1, అగ్నిమాపక నిరోదక శాఖ1, ఐసిడిఎస్‌ 1, సిఆర్‌డిఏ 1, అటవీ శాఖ 1, ఆర్‌అండ్‌బి 1, మైనార్టి వెల్ఫేర్‌ 1, అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్‌ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్‌ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
స్పందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డ్వామా పిడి జె. సునీత, ఐసిడిఎస్‌ పీడి జి. ఉమాదేవి, జిల్లా ట్రెజరీ అధికారి రెహమాన్‌, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిసివో సిహెచ్‌ శైలజ, డిఆర్‌డిఏ పీిడి శ్రీనివాసరావు, హౌసింగ్‌ పీడి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి యం విజయభారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *