Breaking News

సత్యం, త్యాగం, అహింసా, నిస్వార్థ సేవ, సహకారం మనమందరం అలవర్చుకోవాలి…

-తమిళనాడు మాజీ గవర్నరు పెందుర్తి రామమోహన రావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి కార్యక్రమం స్థానిక సిద్ధార్థ ఆడిటోరియం నందు ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారకనిధి వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తమిళనాడు మాజీ గవర్నరు పెందుర్తి రామమోహన రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ మరణం సందర్భంగా ఇచ్చిన సంతాప సందేశంలో “గాంధీ లాంటి మనిషి రక్తమాంసాలతో ఈ భూమి మీద నడయాడాడంటే ముందు తరాల వారు నమ్మటం అసాధ్యం” అని ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఐన్ స్టీన్ అన్న మాటలను గుర్తుకు చేసుకున్నారు. బహుశా ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి గురించి చెప్పడం గాని రాయడం గాని ఇంతవరకు జరగలేదు ఇకమీదట జరగదు ఆనడం లో అతిసయోక్తి కాదు అని ఆయన అన్నారు. మాతృ దేశాన్ని దాశ్య శృంఖలాల నుండి విముక్తి కలిగించడానికి, ఆస్పృశ్యతలను నివారించడానికి, మత సామరస్యాన్ని పెంపొందించడానికి, స్వయం ప్రతిపత్తిని సాధించడానికి, నీతివంతమైన ఆదర్శ జీవితం గడపడానికి, శాంతియుత సమాజం కోసం, విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం ఆయన తన జీవితాన్ని ఆంకితం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన ప్రవచించిన విలువలు బోధసలు ఈ నాటి మానవాళికి, మనుమడకు మరింతగా అవసరమన్నారు. సత్యం, త్యాగం, ఆహుసా నిస్వార్థ సేవ మరియు సహకారం మనమందరం అలవర్చుకోవాలని ఆయన అన్నారు. సత్యము, ఆహింపలే భగవంతుని ప్రతిరూపాలని ఆయన బలంగా విశ్వసించారని, ప్రతి మనిషిలో నూ విశ్వాంతర్యామిని చూడగలగడమే మానవతకు పరాకాష్ట అని ప్రవచించారని ఆయన అన్నారు. సత్యాగ్రహం అనేవి బలవంతుల ఆయుధమని, బలహీనులది కాదని ఆయన చాలా సార్లు దృవీకరించి ఆచరించి చూపారని ఆయన గుర్తుచేసారు. కోట్లాడి భారతీయుల హృదయాలలో ఆయన స్థానం పదిలం అని ఆయన జీవించిన కాలానికే ఆయన నాయకత్వం పరిమితం కాదని, తరతరాలకు ఆయన ఆదర్శ నాయకుడే. ప్రపంచంలో హింస, లోభత్వం, ఆత్యాస, వివక్షుతులు, ఆసమానతలు ఉన్నంతకాలం గాంధీజీ బోధనలు ప్రజలకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి చైర్మన్ గాంధీ పి.సి.కాజ అధ్యక్షత  వహించారు. జాతిపిత ను ఉద్దేశించి మాట్లాడిన వారిలో జస్టిస్ పి.యస్.నారాయణ మాజీ జడ్జి, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, కార్యదర్శి వై. రామచంద్ర రావు ఉన్నారు. విద్యార్థులు ఆలపించిన గీతాలు, ఉపన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆనంతరం గవర్నమెంట్, ప్రయివేటు పాఠశాల, కళాశాల లోని విద్యార్థులకు చిత్రలేఖనం, పాటల పోటీలు, క్విజ్, వ్యక్తృత్వ పోటీల 53 మంది విజేతలకు ప్రశంసాపత్రాలను, షీల్డ్, మెమొంటోలను అందజేసారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి డోకిపర్తి శంకరరావు, కన్వీనర్లు జి.రశ్మి సమరం, రావి శారద, కోఆర్డినేటర్ రవితేజ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *