Breaking News

రాష్ట్ర చలనచిత్ర, టి.వి., నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పోసాని కృష్ణ మురళి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి.వి. & నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి అన్నారు. విజయవాడ ఆర్.టి.సి. కాంప్లెక్స్ లో 4వ అంతస్తులో గల ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర, టి.వి., నాటక రంగ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కృష్ణ మురళి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని చలన చిత్ర పరిశ్రమపై పూర్తి అవగాహనా ఉందని పరిశ్రమ ఎదుర్కుంటున్న సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పోసాని కృష్ణ మురళి అన్నారు. ప్రజల సాధక బాధకాలను ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తూ జనాల్లోంచి పుట్టిన నాయకుడు  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని అందుకే జగన్ మోహన్ రెడ్డి అంటే ఎంతో ఇష్టమని అయన అన్నారు. చలన చిత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలనే ఆలోచనలకు అనుగుణంగా వారి ఆశయాల మేరకు ఈ సంస్థ చైర్మన్ గా కృషి చేస్తానని కృష్ణ మురళి అన్నారు. జగన్ మోహన్ నాకు ఈ పదవి ఇస్తారని అనుకోలేదని ముఖ్యమంత్రిని దూరంగా చూస్తూ ఇష్టపడే వాడినని, చేతనైతే సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తాను తప్ప తప్ప అబద్దాలు చెప్పనని, చెడు చేయనని అన్నారు. సినీ పరిశ్రమ, టి.వి. నాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకు వస్తానని చైర్మన్ పోసాని కృష్ణ మురళి అన్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏకలవ్య అభిమాని పోసాని కృష్ణ మురళి అని అన్నారు. చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీయకరించిన కృష్ణ మురళి సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. వైజాగ్ లో 100 ఎకరాలు సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అందుకు అనువైన వాతావరణం త్వరితగతిన అనుమతులు ప్రభుత్వం ఇస్తుందని చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ మురళి ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేరుస్తారని అన్నారు. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా సందేశాత్మక సినిమాలు తీయాలని టి.వి. నాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరచాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.ఏపి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఎవరో ఒకరు సమాజం కొరకు గొంతెత్తి మాట్లాడాలని అటువంటి విప్లవాత్మకమైన చర్యలు పోసాని కృష్ణ మురళి చేపడతారన్నారు. చిన్న చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గౌతమ్ రెడ్డి కోరారు.
మాజీ ఎఫ్.డి.సి. చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ పోసాని కృష్ణ మురళితో మాట్లాడితే నడిచే నిఘంటువతో మాట్లాడినట్లు ఉంటుందని అన్నారు. దివంగత ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సినిమా పరిశ్రమకు వైజాగ్ లో 210 ఎకరాలు కేటాయించారని అది చంద్రబాబు హయాంలో అభివృద్ధి చేయాలని నేను తలంచినా కార్యరూపం దాల్చలేదన్నారు. హీరోలు అందరూ సినిమా షూటింగులు ఒక్క షెడ్యూల్ అయినా ఆంధ్ర ప్రదేశ్ లో తీయాలని, ఎఫ్.డి.సి. చైర్మన్ గా ఉన్న కాలంలో నేను కోరానని అయితే గోపీచంద్ ఒక్కరే నేను చెప్పిన విధంగా ఒక షెడ్యూల్ షూటింగ్ తీసారని అన్నారు.
సినీ నిర్మాత  కళ్యాణ్ మాట్లాడుతూ మరాజాకు ఈ పదవి వచ్చినందుకు చాల సంతోషంగా ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఈ సంస్థకు చైర్మన్ గా రావడం శుభపరిణామం అన్నారు. సినిమా ఇండస్ట్రీ ని వచ్చే ఆరు నెలల్లో వైజాగ్ లోకి తీసుకువెళ్తారనే నమ్మకం నాకు ఉందని అన్నారు.
ఎం ఎల్ సి  డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ పోసాని కృష్ణ మురళి మా జిల్లా వాడని రచయితగా సందేశాత్మక మాటలు అనేక సినిమాలకు అందించారన్నారు.ముందుగా సినీ పరిశ్రమలో ఇటీవల మరణించిన డైరెక్టర్ లు సాగర్, కె. విశ్వనాధ్ చిత్రపటాలకు పూల మాలలు వేసి రెండు నిముషాలు మౌనం పాటించారు.సభకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి, టి.వి. నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి. విజయ కుమార్ రెడ్డి సభకు అధ్యక్షత వహించగా ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ షజీల, శాసనసభ్యులు మల్లాది విష్ణు, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ శ్రీమతి నందమూరి లక్ష్మి పార్వతి, చల్ల మధుసూదన్ రెడ్డి, సమాచార శాఖ అడిషినల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణ లత, జాయింట్ డైరెక్టర్ లు పి. కిరణ్ కుమార్, కస్తూరి భాయ్ తేళ్ల, చీఫ్ ఇన్ఫర్ మేషన్ ఇంజినీర్ ఓ. మధుసూదన్, రీజనల్ ఇన్ఫర్ మేషన్ ఇంజినీర్ కృష్ణా రెడ్డి, ఎఫ్. డి. సి. జనరల్ మేనేజర్ శేష సాయి, సినీ నాటక రంగ అభివృద్ధి సంస్థ ప్రతినిధులు, పలువురు సినీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *